అన్వేషించండి

S Jaishankar: మోదీతో ఎస్ జైశంకర్ భేటీ, కెనడాతో ఉద్రిక్తతల నడుమ ప్రాధాన్యత

S Jaishankar: కెనడా, భారత్ మధ్య రాజుకున్న దౌత్యపరమైన వివాదం మధ్య విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీని కలిశారు.

S Jaishankar: కెనడాలో ఖలిస్థాననీ ఉగ్రవాది హత్యపై భారత్ కు, కెనడాకు మధ్య దౌత్యపరమైన వివాదం రాజుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇవాళ ఉదయం పార్లమంట్ భవనంలో ప్రధానితో సమావేశమైన జైశంకర్.. వివాదం గురించి ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, కెనడాలో భారతీయుల పరిస్థితిపై కూడా ఎస్ జైంశకర్ ప్రధాని మోదీకి నివేదించినట్లు సమాచారం.

ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. 

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు.

కెనడా, భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు హీన దశకు చేరుకుంటున్నాయి. ఖలిస్థానీ అతివాద భావజాలం రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. పదేపదే కోరినప్పటికీ జస్టిన్‌ ట్రూడో అతివాదాన్ని అణచివేయడంలో విఫలమయ్యారు. తాజాగా ఆ దేశంలో జరిగిన ఖలిస్థాన్‌ టైగర్ ఫోర్స్‌ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ పాత్ర ఉన్నట్టు ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.

అంతేకాకుండా మన దేశ ఇంటెలిజెన్స్‌ అధికారిని జస్టిన్‌ ట్రూడో బహిష్కరించారు. మోదీ ప్రభుత్వం సైతం అంతే దీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దాంతో ఇక్కడి కంపెనీల్లో కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (CPPIB) పెట్టిన పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది. బుధవారం స్టాక్‌ మార్కెట్లు మొదలయ్యాక వీటిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.

భారత కంపెనీల్లో కెనడా పెన్షన్‌ బోర్డు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెట్టింది. ఈ విలువ రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. జూన్‌ త్రైమాసికానికి డెల్హీవరీలో కెనడా ఫెన్షన్‌ ఫండ్‌కు ఆరుశాతం వాటా ఉంది. సోమవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఈ విలువ రూ.1878  కోట్ల వరకు ఉంటుంది. ఇక కొటక్‌ మహీంద్రాలో 1.15 బిలియన్ల కెనడా డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. అంటే మొత్తం కంపెనీలో దీని వాటా 2.68 శాతం. జూన్‌ త్రైమాసికంలో 1.66 శాతం వాటా అమ్మినప్పటికీ తన వాటా విలువ రూ.9,582 కోట్ల మేరకు ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget