అన్వేషించండి

Air India Flight Cancel: జూన్ 12 విషాదం తరువాత తొలి అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం రద్దు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, AI-159 విమానం సాంకేతిక కారణాల వల్ల అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరాల్సిన సర్వీసు చివరి నిమిషంలో రద్దు చేశారు.

London Ahmedabad Flight Cancel | అహ్మదాబాద్: జూన్ 12 ప్రమాదం తరువాత నడవాల్సిన తొలి అహ్మదాబాద్ - లండన్ ఎయిరిండియా విమానం రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-159 చివరి నిమిషంలో రద్దు చేశారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం బయలుదేరాల్సి ఉన్నది. అయితే టెక్నికల్ రీజన్స్‌తో అహ్మదాబాద్- లండన్ ఎయిరిండియా విమానాన్ని రద్దు చేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. అసలేం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 

ఉదయం 11 గంటల వరకు ఫ్లైట్ బయలుదేరుతుందని తమకు చెప్పారని ప్రయాణికులు తెలిపారు. అంతలోనే విమానం కండీషన్ సరిగ్గా లేదని టెన్నికల్ ప్రాబ్లం ఉందని కొందరు చెప్పారు. ముందస్తు చెకింగ్ పూర్తికాలేదని విమానం రద్దు అయిందని చెబుతున్నారని ప్రయాణికులు వాపోయారు. చివరి నిమిషంలో అహ్మదాబాద్ లండన్ విమానం రద్దు గురించి తెలిసింది. చివరి నిమిషంలో చెబుతున్నారు అంటే ప్రయాణికుల భద్రతా గురించి ఇంకా సరైన చర్యలు తీసుకుంటున్నారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.

100 శాతం రీఫండ్.. లండన్ నుంచి అమృత్‌సర్ విమానం సైతం రద్దు

‘అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం రద్దు చేశాం. ప్రయాణికులకు హోటల్ వసతిని అందిస్తున్నాము. ప్రయాణీకులు రద్దు చేసుకుంటే  వారికి 100 శాతం రీఫండ్ ఇస్తాం.  లేదా ఉచిత రీషెడ్యూలింగ్ ఎంచుకుంటే ఆ సౌకర్యమైనా కల్పిస్తాం. జూన్ 17న లండన్ గాట్విక్ నుంచి అమృత్సర్‌కు బయలుదేరాల్సిన AI170 విమానం రద్దు అయింది" అని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

ఎయిరిండియా ప్రయాణం చేయవద్దు.. ప్రయాణికుడి ఆవేదన
ANIతో ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ, ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయవద్దు. కొన్ని గంటల కింద లండన్ గాట్విక్ వెళ్లడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ బయలుదేరే సమయంలో సర్వీసు రద్దు అయింది అన్నారు. ఎందుకు విమానం రద్దు చేశారని అడిగితే సమాధానం లేదు. సిబ్బందికే విమానం సర్వీసు గురించి తెలియకపోతే సామాన్య ప్రయాణికులకు ఎలా తెలుస్తుంది. నేను పాట్నా నుంచి వస్తున్నాను. కుటుంబంతో కలిసి వచ్చాను. మమ్మల్ని హోటల్ కు వెళ్లమంటున్నారు. కుటుంబ సభ్యులకు షెల్టర్ ఎవరు ఇస్తారు. రీఫండ్ గురించి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆన్‌లైన్‌లో చెక్ చేయాలని చెప్పారు. గట్టిగా నిలదీస్తే మా పీఎన్ఆర్ నెంబర్, వివరాలు రాసుకున్నారు. వెంటనే రీఫండ్ రాకపోతే, వేరే ఫ్లైట్ సర్వీసు ఏర్పాటు చేయకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఎవరూ ఎయిరిండియాలో టికెట్లు బుక్ చేయవద్దు. ఇందులో ప్రయాణం చేయవద్దు’ అని ఆ ప్రయాణికుడు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని గంటల తరువాత సైతం విమానం అందుబాటులో ఉండదని చెబుతున్నారంటూ మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఎక్కిన మమ్మల్ని చివరి నిమిషంలో కిందకి దించుతున్నారు. విమాన ప్రయాణం అంటే ముఖ్యమైన పనులుంటాయి. కానీ చివరి నిమిషంలో రద్దు చేసి, కనీసం సరైన కారణం చెప్పకపోవడం దారుణం అన్నారు. 

జూన్ 12 కూలిన ఎయిరిండియా విమానం
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా, ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget