అన్వేషించండి

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

Rahul Gandhi In Ayodhya: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అయోధ్యకు వెళ్లి బాలరాముడ్ని దర్శించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

క్లెయిమ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసారి పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశాక, అయోధ్యకు వెళ్లి రాముడ్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ప్రజలు మోదీ మోదీ అని గట్టిగా నినాదాలు చేశారు. 

ఫ్యాక్ట్(వాస్తవం): ఫిబ్రవరి 2024లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసినప్పుడు తీసిన వీడియోలను తాజాగా షేర్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోగా.. ప్రజలు మోదీ మోదీ అని నినాదాలు చేసినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రెండు దశాబ్దాల నుంచి ఆయన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న  రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల బరిలోకి రాహుల్ దిగుతున్నారు. మే 3న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాహుల్ బ్రాహ్మణుడిగా మారిపోయారని నెటిజన్లు ఎద్దేవా చేశారు.

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 5 (ఆదివారం) అయోధ్యలోని బాలరాముడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రధాని మోదీ 2 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. వైరల్ ట్వీట్ ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు. 
Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

న్యూస్‌ చెకర్ దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. రాహుల్ గాంధీ ఇటీవల ఏ ఆలయాన్ని దర్శించుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసినట్లు వార్త కనిపించలేదు. దీనిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ) ఫిబ్రవరి 3, 2024న గుజరాత్ బీజేపీ అధికారిక ఖాతా ద్వారా అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ కనిపించింది. దేవగఢ్ లో బాబా వైద్యనాథ్ ధామంలో రాహుల్ గాంధీని చూసిన భక్తులు మోదీ మోదీ అని నినాదాలు చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BJP Gujarat (@bjp4gujarat)

మరిన్ని కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా 3, 4 ఫిబ్రవరి 2024లో వార్తలు కనిపించాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్‌లోని దేవఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. 
Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

‘కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 2న జార్ఖండ్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న గులాబీ రంగు ధోతీ, నుదుటిపైన గంధంతో రాహుల్ గాంధీ ప్రసిద్ధ జ్యోతిర్లింగంలో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారు. కొందరు రాహుల్ గాంధీ జిందాబాద్ అని నినాదాలు చేశారు, కానీ వెంటనే ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేశారని  ఫిబ్రవరి 3, 2024న టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

రాయ్‌బరేలీ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రాహుల్ అయోధ్యకు వెళ్లలేదని ఆ వైరల్ వీడియో అయోధ్యలో రాహుల్ గాంధీ కాదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ నేతలు నామినేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ వెంట వచ్చారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్ లోని దియోగఢ్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేస్తున్న వీడియోను.. రాయ్ బరేలి నుంచి నామినేషన్ తరువాత అయోధ్యకు వెళ్లి పూజలు చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారు.

This story was originally published by Newschecker, as part of the Shakti Collective. This story has been translated by ABP Desam staff.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget