By: ABP Desam | Updated at : 12 Jan 2023 11:57 PM (IST)
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత ( Image Source : Getty Images )
Former Union Minister Sharad Yadav Passes Away: ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కున్నుమూశారు. ఆర్జేడీ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు 75 సంవత్సరాల వయసులో గురువారం (జనవరి 12) ఆయన తుదిశ్వాస విడిచారు. శరద్ యాదవ్ ఇకలేరన్న విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాన్న ఇక లేరు అని పోస్ట్ చేశారు. బిహార్‌లోని మాధేపురా స్థానం నుంచి శరద్ యాదవ్ నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధ్యక్షుడితో పాటు కేంద్రంలో మంత్రిగా సేవలు అందించారు. మాజీ మంత్రి శరద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్నారు.
पापा नहीं रहे 😭
— Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023
అపస్మారక స్థితిలో శరద్ యాదవ్ ను స్థితిలో ఫోర్టిస్ ఎమర్జెన్సీకి తీసుకువచ్చారని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే పల్స్ లేదని, అయితే సీపీఆర్ చేసి ఆయనను బతికించేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. గురువారం రాత్రి 10.19 గంటలకు సీనియర్ నేత శరద్ యాదవ్ కన్నుమూశారని ప్రకటించారు. ఆయన కుటుంబానికి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
బీజేపీతో సంకీర్ణ కూటమి కారణంగా జనతాదళ్ (యునైటెడ్) నుండి విడిపోయిన శరద్ యాదవ్ మే 2018లో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (LJD)ని ప్రారంభించారు. శరద్ యాదవ్ జూలై 1, 1947న మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలోని అఖ్మౌ గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1974లో జబల్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. శరద్ యాదవ్ 7 పర్యాయాలు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు శరద్ యాదవ్. ఈ క్రమంలో 2003లో శరద్ యాదవ్ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడయ్యారు.
తేజస్వి యాదవ్ సంతాపం
జేడీయూ మాజీ చీఫ్ శరద్ యాదవ్ మృతి పట్ల ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించాను. మన అందరి ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
ప్రధాని మోదీ సంతాపం
"శరద్ యాదవ్ ఆకస్మిక మరణం నన్నెంతగానో బాధిస్తోంది. సీనియర్ నేత శరద్ యాదవ్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ లోహియాను ఆదర్శంగా తీసుకుని గొప్పగా ప్రేరణ పొందారు. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయన కుటుంబానికి సంతాపం, ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్
BBC Documentary: ఈ పిటిషన్ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం
Bihar Politics: చావనైనా చస్తాం కానీ బీజేపీతో పొత్తు మాత్రం పెట్టుకోం - బిహార్ సీఎం నితీష్ కుమార్
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!