Hemant Soren News: హేమంత్ సొరేన్ అక్రమాస్తుల కేసులో ఊహించని మలుపు
Jharkhand News: జెఎంఎం చీఫ్ సోరేన్ సహా వివాదాస్పద కాంగ్రెస్ ఎంపీ అయిన ధీరజ్ సాహు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించిన తర్వాత ఈ ఈ మలుపు వెలుగులోకి వచ్చింది.
Hemant Soren and Dheeraj Sahu News: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ చిక్కుకున్న అవినీతి కేసుల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. జెఎంఎం చీఫ్ సోరేన్ సహా వివాదాస్పద కాంగ్రెస్ ఎంపీ అయిన ధీరజ్ సాహు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించిన తర్వాత ఈ ఈ మలుపు వెలుగులోకి వచ్చింది. ధీరజ్ సాహుపై గత ఏడాది డిసెంబరులో ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.351 కోట్ల నగదును అప్పట్లో స్వాధీనం చేసుకోవడంతో గతేడాది డిసెంబరు నెలలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ప్రధానంగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో రోజుల తరబడి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రూ.351 కోట్లను ఐటీ శాఖ జప్తు చేసింది. కాంగ్రెస్ ఎంపీ వద్ద ఇంత భారీ మొత్తంలో డబ్బు బయటపడడంతో దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఆయన నుంచి ప్రతి పైసా తిరిగి వసూలు చేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు.
తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఇంటి వద్ద ఈడీ గుర్తించిన బీఎండబ్ల్యూ కారును ధీరజ్ సాహుకు చెందిన మానేసర్‌కు చెందిన సంస్థ పేరు మీద రిజిస్టర్ చేసి ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు అక్రమాలు భారీగా బయటపడడం.. తాజాగా ఆ నేతతోనే హేమంత్ సోరేన్ కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపుతోంది.
దూరం పెట్టిన కాంగ్రెస్
గత డిసెంబరులో జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన మద్యం కంపెనీ నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ను దూరంగా ఉంచింది. ఆ మేరకు ఎక్స్‌లో అధికారిక ట్వీట్ కూడా చేసింది. కాంగ్రెస్‌కు.. ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆయన ఆస్తుల నుంచి ఆదాయపు పన్ను అధికారులు భారీ మొత్తంలో నగదును బయటపెట్టినందున.. అందుకు ఆయనే బాధ్యులని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లక్ష్యంగా మారింది.