Early Elections News: ముందస్తు ఎన్నికల రూమర్స్‌ను ఖండించిన ఈసీఐ! షెడ్యూల్ విడుదల అప్పుడే
AP Elections 2024: ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఆ ఊహాగానాలను ఎన్నికల కమిషన్ వర్గాలు కొట్టి పారేశాయి.
General Elections 2024: దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే జరుగుతాయనే ఊహాగానాలను భారత ఎన్నికల సంఘం ఖండించింది. దీంతో మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2019 లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆ రూమర్లను తిప్పికొట్టింది.
ఫిబ్రవరి 20 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఊహాగానాలను ఎన్నికల కమిషన్ వర్గాలు కొట్టి పారేశాయి. గతంలో లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఎన్నికల కోసం ఇప్పటి వరకు కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన సాగింది. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు ఒడిశాలో ఎన్నికల సంఘం పర్యటన జరగనుంది. ఆ తరువాత బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లలో పర్యటన ఉండనుంది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉంటుందని తెలుస్తోంది.