అన్వేషించండి

El nino: స‌వాల్ విసురుతోన్న ఎల్‌నినో- పెను మార్పులు చూడబోతున్నామంటున్న శాస్త్రవేత్తలు 

ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రం ఉప‌రిత‌లంపై  ఏర్ప‌డే ఎల్‌నినో ప్ర‌భావంతో పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు, ఆహార ఉత్ప‌త్తుల దిగుబ‌డిపై ప్ర‌భావం 

పెరుగుతున్న వాహ‌నాల సంఖ్య‌, పరిశ్రమల నుంచి వెలువడే  వ్యర్థాలతో ఇప్ప‌టికే మాన‌వాళి భ‌యంక‌ర‌మైన కాలుష్య కోర‌ల్లో చిక్కుకుంటోంది. గ్లోబ‌ల్ వార్మింగ్ అంటూ ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు కాలుష్య నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంత గట్టిగా చెబుతున్నా ఆ దిశ‌గా ప్ర‌పంచ దేశాలు చేప‌డుతున్న చ‌ర్య‌లు స‌రిపోవ‌డం లేదు. అనూహ్యంగా వ‌ర‌దలు రావ‌డం, లేదంటే అనావృష్టితో వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు మ‌నిషి మ‌నుగ‌డ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప‌సిఫిక్ మహాస‌ముద్రంపై ఏర్ప‌డిన ఎల్‌నినో మాన‌వాళికి పెను స‌వాలు విసురుతోంది. 

ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం ఉప‌రిత‌లంపై ఏర్ప‌డిన ఎల్‌నినో ప్ర‌భావంతో అనూహ్య వాతావ‌ర‌ణ మార్పులు ఏర్ప‌డ‌నున్నాయి. భూ వాతావ‌ర‌ణం వేడెక్క‌డం, రుతుప‌వ‌నాల గ‌మ‌నం దెబ్బ‌తింటుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియ‌స్ దాట‌కూడ‌ద‌న్న పారిస్ ఒప్పందానికి విఘాతం క‌ల‌గ‌నుంద‌ని, 2024లోనే స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌ల పెరుగుద‌ల 1.5 డిగ్రీల సెల్సియ‌స్ దాట‌నుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఇది రెండు డిగ్రీల సెల్సియ‌స్‌ను చేరుకుంటే భూ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

అనూహ్య వాతావ‌ర‌ణ మార్పులు
ఎల్‌నినో కార‌ణంగా అనూహ్య వాతావ‌ర‌ణ మార్పులు ఏర్ప‌డ‌నున్నాయి. ఎల్ నినో కార‌ణంగా రుతు ప‌వ‌నాల గ‌మనం దెబ్బ‌తింటుంద‌ని, క‌ర‌వు కాట‌కాలు, కుండ‌పోత వ‌ర్షాలు వంటివి సంభివించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అడ‌వుల్లో కార్చిచ్చు వంటివి ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణంపై ఎల్‌నినో ప్ర‌భావం చూపిస్తుంద‌ని, ఆహార పంట‌ల దిగుబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  

యూర‌ప్ వాసులూ జ‌ర జాగ్ర‌త్త!
ఎల్‌నినో ప్ర‌భావం యూర‌ప్ ఉత్త‌ర ప్రాంతంపైనా ఉండ‌నుంది. ఎన్నో వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్ప‌టికీ ఈ ప్రాంతంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర‌మైన చ‌లి, పొడి వాతావ‌ర‌ణాన్నిప్ర‌జ‌లు అనుభ‌వించ‌నున్నారు. యూర‌ప్ వాసులు ఇందుకు త‌గ్గ‌ట్లు జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచిస్తున్నారు. ఇక్కడ జెట్‌ స్పీడ్‌తో వీచే రాస్‌బై వేవ్స్‌ అల్లకల్లోలం సృష్టిస్తూ, హిందూ మహాసముద్రంపైకి విస్తరిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

మ‌న‌పై ప్ర‌భావ‌మెంత‌?

భార‌త‌దేశానికి సంబంధించి చివ‌రి వందేళ్ల‌లో 18 క‌ర‌వు సంవ‌త్స‌రాలు ఉండ‌గా, అందులో ప‌ద‌మూడింటిపై ఎల్ నినో ప్ర‌భావం ఉంది. 1900 నుంచి 1950 వ‌ర‌కు ఏడు ఎల్‌నినో సంవ‌త్స‌రాలు ఉండ‌గా, 1951 నుంచి 2021 వ‌ర‌కు 15 ఎల్ నినో సంవ‌త్స‌రాలు ఉన్నాయి. వీటిల్లో తొమ్మిదేళ్లు యావ‌రేజ్ కంటే త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదయ్యింది. 


ఏమిటీ ఎల్‌నినో?
సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌నినో వర్షాభావ పరిస్థితిని, దాని వ్య‌తిరేక ప‌దం లానినో విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని వివరిస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్‌ నినో, లా నినోలకు కారణం అవుతున్నాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌’ (ఈఎన్‌ఎస్‌వో) వలయాలు అంటారు. ఈఎన్‌ఎస్‌వో ఉష్ణదశను ఎల్‌నినో అని, చలి దశను లా నినో అని పేర్కొంటారు. ఎల్‌నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతున్నది. ఈ పెరుగుదల ఒక్కోసారి 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉండవచ్చు. దీనివల్ల సముద్రం, దానిపైన ఆవరించిన వాతావరణం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget