Eknath Shinde Doppelganger: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌కు జెరాక్స్ కాపీలా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
Eknath Shinde Doppelganger: అచ్చం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేలా ఉండే ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Eknath Shinde Doppelganger: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు జెరాక్స్ కాపీలా ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? అచ్చం శిందేలాగే కనిపించే ఈయన ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఫుడ్ వేస్టేజ్ సహా పలు సామాజిక అంశాలపై హర్ష్ అప్పుడప్పుడూ ట్వీట్లు చేస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్‌లో
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను.. ఆ పక్కనే తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఉంచి హర్ష్ గోయెంకా ఒక క్యాప్షన్ పెడుతూ ట్వీట్ చేశారు.
To those who come to meet me, sorry for any convenience. I know my Z+ security can be a nuisance. Look forward to your support. Jai Maharashtra! 😜 pic.twitter.com/zXb9HynS6W
— Harsh Goenka (@hvgoenka) July 3, 2022
సరదాగా ఆయన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. ఆ ఫొటోకు కామెంట్లు చేస్తున్నారు.
అంతకుముందు
In Guwahati, if anyone wants to reach me😀😀 pic.twitter.com/3vPMO1pYLW
— Harsh Goenka (@hvgoenka) June 22, 2022
మహారాష్ట్రలో కొద్దిరోజుల ముందు క్యాంప్ రాజకీయాలు నడుస్తున్న సమయంలో కూడా హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేశారు. తాను గువాటిలోనే ఉన్నానని ఎవరైనా కావాలంటే కలవొచ్చంటూ సరదాగా ట్వీట్ పెట్టారు.
Also Read: Chennai: OTP చెప్పలేదని ప్రయాణికుడ్ని కొట్టి చంపేసిన క్యాబ్ డ్రైవర్!
Also Read: Heavy Rains In Maharashtra: మహారాష్ట్రలో వరుణుడి ధన్‌ధనాధన్ బ్యాటింగ్- నీట మునిగిన ముంబయి