Trendning News: దోశలు వేసుకొని నెలకు 6 లక్షల సంపాదన- ఇతన్ని చూసి కుళ్లుకోని వాళ్లు ఉండరేమో!
Viral News: ఉద్యోగమైనా ఇతర ఏపనైనా లక్ష్యం సంపాదనే. అయితే దోశలు విక్రయించే వ్యాపారి ఆదాయం ముందు సర్కారీ ఉద్యోగుల ఆదాయం దిగదుడుపేనని తేలిపోయింది. ఈ వ్యాపారి నెలకు 6లక్షలు ఆర్జిస్తున్నాడట!
Trending News: చేయాలనే ఆలోచన ఉంటే చాలు పని దొరకడం పెద్ద విషయం కాదు. నీలో సత్తా ఉంటే అడవిలో ఆకులు అమ్మొచ్చు. ఎడారిలో ఇసుకను సేల్ చేయవచ్చు. ఇలాంటి కొటేషన్లు ఎక్కడైనా పెట్టుకో అనకండీ కేవలం దోశల వేస్తూనే ఓ వ్యక్తి రోజుకు 20 వేల రూపాయలు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్య కలగక మానదు. ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ పని చేసేందుకు ఏం ఉందని నిట్టూర్చే వాళ్లకు సమాధానం ఈ వ్యక్తి.
ఉద్యోగాల కోసం క్యూలు కడుతున్న నిరుద్యోగుల(Unemployment) గురించి తెలియంది ఎవరికి?! చిన్నపాటి ఉద్యోగానికి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. నెలకు 10 వేల రూపాయలు ఇచ్చే ఉద్యోగానికి కూడా.. పోటీ పడుతున్న రోజుల్లో ఉన్నాం. కానీ, సగటు ఉద్యోగి సంపాదనతో పోలిస్తే.. రోడ్డు పక్కన దోశలు విక్రయించే వ్యాపారి ఆదాయమే.. బెస్టు-దిబెస్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు. తాజాగా వైరల్ అయిన ఓవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ వీడిలో దోశలు విక్రయిస్తున్న వ్యక్తి ఏకంగా రోజుకు 20 వేల రూపాయలు సంపాయిస్తున్నాడట. అంటే.. నెలకు సుమారు రూ.6 లక్షల ఆదాయం. ఇది నెలకు రూ.50 వేల సంపాయించే సగటు ఉద్యోగి ఏడాది జీతానికి సమానం. కానీ, ఉద్యోగికి ఉన్నట్టుగా పంక్చువాలిటీ.. బాస్ హెచ్చరికలు, బెదిరింపులు.. సెలవు కావాలంటే నిరీక్షించడం, బతిమాలడం వంటివి ఏమీ ఉండవు. తన వ్యాపారం-తన వ్యవహారం.. అన్నట్టే ఉందట ఈ దోశల వ్యాపారి లైఫ్. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న ఈ వ్యవహారం ఏంటో తెలుసుకుందామా?
A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.
— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024
exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.
doesn’t pay single rupee in income tax.
but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.
వైరల్ విషయం ఏంటంటే..
సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌లో, రోడ్డు పక్కన దోశలు(DOSA) విక్రయించే వ్యక్తి ప్రతి రోజు రూ. 20 వేలు సంపాదిస్తున్నాడట. ఈ లెక్కన ఆయన నెలవారీ ఆదాయం రూ. 6 లక్షలు అవుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇంటర్నెట్ యూజర్లు షాక్‌కు గురవుతున్నారు. ఇంటర్నెట్ యూజర్ నవీన్ కొప్పరం ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ చేశారు. కొప్పరం తన ఇంటి దగ్గర దోశెల వ్యాపారి ప్రతిరోజు సుమారు రూ.20 వేలు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది నెలకు రూ.6 లక్షలకు సమానమని కూడా పేర్కొన్నారు. ఖర్చులన్నీ తీసేయగా.. సదరు వ్యాపారి ఆదాయం నెలకు 3 నుంచి మూడున్నర లక్షల వరకు ఉందట. ఇక, దీనిలో ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదని కొప్పరం పేర్కొన్నారు.
కొప్పరం పోస్టు ఇదీ..
"మా ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ ఫుడ్(Street Food) దోశలు అమ్మే వ్యక్తి రోజుకు సగటున రూ. 20 వేలు సంపాదిస్తాడు, ఇది నెలకు మొత్తం రూ. 6 లక్షలు. అన్ని ఖర్చులు మినహా, అతను నెలకు రూ. 3-3.5 లక్షలు సంపాదిస్తాడు`` అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇంత సంపాయిస్తున్నా కూడా.. ఆదాయపు పన్నుగా ఒక్క రూపాయి కూడా చెల్లించడని తెలిపారు. వాస్తవానికి నెలకు రూ.60,000 జీతం పొందుతున్న ఉద్యోగి తన వేతనంలో 10 శాతం పన్ను రూపంలో చెల్లించాలి. కానీ, వీధి వ్యాపారులకు ఎలాంటి పన్నుల బెడద లేకపోవడం గమనార్హమని, ఇదేదో బాగానే ఉందని వ్యాఖ్యానించారు.
10 లక్షల మందికి పైగా..
ఈ పోస్టును @naveenkopparam అనే X ఖాతా ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని ఇప్పటి వరకు పది లక్షల మందికిపైగా వీక్షించడమే కాదు.. లైకులు కూడా కొట్టేశారు. దీనిని చూసిన తర్వాత.. ఇక ప్రభుత్వ కొలువులు ఎందుకులే బాస్.. అని వ్యాఖ్యానించిన వారు చాలా మంది ఉండడం గమనార్హం. చదువు మానేసి దోసె అమ్మడానికి వెళ్లానని మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి సర్కారీ కొలువుల కంటే.. సొంత వ్యాపారమే ముద్దు అనే రేంజ్‌లో సదరు వ్యాపారి దోశెల వ్యాపారం అందరినీ ఆకర్షిస్తుండడం గమనార్హం.
Also Read: సరిహద్దులు శతృదుర్బేధ్యం-పాక్, బంగ్లా సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్