అన్వేషించండి

Modi Gets Trumps Call For 75th Birthday:ప్రధాని మోదీకి ట్రంప్ బర్త్‌డే విషెస్.. ధన్యవాదాలు సైతం తెలిపిన అమెరికా అధ్యక్షుడు

Modi Birthday | సెప్టెంబర్ 16న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీకి కాల్ చేశారు. నేడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ తనకు "అద్భుతమైన" ఫోన్ కాల్ వచ్చిందని, ఈ సందర్భంగా తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మద్దతు ఇచ్చినందుకు భారత ప్రధానికి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. 

నేడు (సెప్టెంబర్ 17న) నరేంద్ర మోదీ పుట్టినరోజు. అయితే మోదీ 75వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇది సుంకాల సమస్యలపై ఒత్తిడిల మధ్య భారతదేశంతో అమెరికా సంబంధాలను పునరుద్ధరించడానికి చేస్తున్న చర్యల్లో ఒక ముఖ్యమైన విషయంగా పరిగణిస్తున్నారు. 

"నా మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ మట్లాడాను. నేను అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. అతను అద్భుతంగా పని చేస్తున్నాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించాలని మద్దతుకు తెలిపినందుకు ధన్యవాదాలు! ప్రెసిడెంట్ DJT," అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

తన పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసినందుకు, తన 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు అమెరికా అధ్యక్షుడికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. "మీలాగే, నేను కూడా భారతదేశం, అమెరికా గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు తీసుకునే చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం" అని అన్నారు.

చివరగా జూన్‌లో ఫోన్ కాల్ సంభాషణ

కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన G7 సమ్మిట్ సందర్భంగా జూన్‌లో ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత ట్రంప్, నరేంద్ర మోదీల మధ్య ఇదే మొదటి ఫోన్ కాల్. ఆ సంభాషణ తర్వాత రోజుల్లో భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఇందులో న్యూఢిల్లీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై 25 శాతం అదనపు సుంకాలు కూడా ఉన్నాయి. భారతదేశం తమపై విధిస్తున్న సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా విమర్శలు గుప్పించారు. అమెరికా అధికారులు సైతం భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత వారంలో ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో.. భారతదేశం, అమెరికా తమ వాణిజ్య చర్చలలో మందుడుగు వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తాను  భావిస్తున్నానని, తన గుడ్ ఫ్రెండ్ మోదీతో రాబోయే వారాల్లో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నానని అన్నారు. మోదీ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ.. భారతదేశం, అమెరికా సన్నిహితులు అని, సహజంగానే భాగస్వాములు" అని పేర్కొన్నారు.

భారతదేశం, అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. టారిఫ్‌లను అన్‌లాక్ చేయడానికి మా వాణిజ్య చర్చలు మార్గం సుగమం చేస్తాయని ట్రంప్ అన్నారు. ఈ చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. తాను సైతం ట్రంప్‌తో మాట్లాడటానికి  ఎదురు చూస్తున్నానని.. మన ప్రజలందరికీ ప్రకాశవంతమైన, మరింత మెరుగైన భవిష్యత్తును ఇవ్వడానికి మేం కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget