News
News
వీడియోలు ఆటలు
X

Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌ కేసులో కొనసాగుతున్న అరెస్టులు - తాజాగా మరో వ్యక్తి

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.

FOLLOW US: 
Share:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా ఇవాళ ఈ స్కామ్‌ కేసులో మరొకరిని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్‌ మీడియాకు చెందిన రాజేశ్‌ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు ఈయన తరలించారని రాజేశ్ జోషిపై ఆరోపణలు ఉన్నాయి. తమ ఆధీనంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. రాజేష్ జోషిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఈయన గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. రామచంద్ర పిళ్లైకి కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. గతంలో ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. కేసులో ఇప్పటి వరకు సాగిన విచారణ, ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి బుచ్చిబాబు పాత్రపై నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. అందుకే ఈ ఉదయం తెల్లవారేసరికి బుచ్చిబాబును అరెస్టు చేసింది సీబీఐ. అరెస్టుకు ముందు ఆయన్ని పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా. అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రామచంద్ర పిళ్లై వద్ద చార్టెడ్ అకౌంట్‌గా పని చేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పని చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్ లో లిక్కర్ స్కాం లింకులతో దేశ వ్యాప్తంగా నలభై చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్ లోని శ్రీసాయి కృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఎమ్మెల్సీ కవిత స్థాపించిన భారత జాగృతి రిజిస్టర్ అడ్రస్ కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు ఎమ్మెల్సీ కవితతో బుచ్చిబాబు దిగిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. 

గౌతమ్‌ మల్హోత్రా కూడా అరెస్టు
మరోవైపు, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్‌ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు బుధవారం (ఫిబ్రవరి 8) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతణ్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. 

ఢిల్లీ సీఎం పేరు కూడా
ఎన్నో మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. మరో సంచలనం ఏంటంటే చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ ఈసారి ఏకంగా కేజ్రీవాల్ పేరునీ జోడించింది.

ఎన్నికల ఖర్చుకోసమే అంటున్న ఈడీ
పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం కవిత.. మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత రూ.3.40 కోట్లు, మాగుంట రూ.5 కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌ పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.

Published at : 09 Feb 2023 12:28 PM (IST) Tags: Delhi Liquor Scam Delhi News Chariot Productions Media Rajesh joshi Rajesh joshi arrest MLC Kavitha in Delhi liquor scam

సంబంధిత కథనాలు

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Gold-Silver Price Today 29 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 29 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో బీర్ టిన్ ఫొటో పెట్టాడు, బుక్ అయ్యాడు - కాస్త చూసుకోవాలిగా బ్రో

ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో బీర్ టిన్ ఫొటో పెట్టాడు, బుక్ అయ్యాడు - కాస్త చూసుకోవాలిగా బ్రో

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Value Buys: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?

Value Buys: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?