Delhi CM Arvind Kejriwal: ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వాలి, అరెస్ట్ చేయడం కాదు: కేజ్రీవాల్
Delhi CM Arvind Kejriwal: ఈడీ అరెస్ట్ చేసిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు పద్మ విభూషణ్ ప్రకటించాలని కేజ్రీవాల్ అన్నారు.
Delhi CM Arvind Kejriwal: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యేంద్ర జైన్‌కు 'పద్మ విభూషణ్' ఇవ్వాలని కేజ్రీవాల్ అన్నారు. దిల్లీకి మొహల్లా క్లినిక్‌లు అందించిన సత్యేంద్ర జైన్ ప్రతిష్ఠాత్మక 'పద్మ విభూషణ్' అవార్డుకు అర్హుడని కేజ్రీవాల్ అన్నారు.
తప్పుడు కేసులు
రాజకీయ దురుద్దేశంతోనే సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ కూడా గతంలో సత్యేంద్ర జైన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇప్పుడు ఈడీ దర్యాప్తు సాగిస్తోందని, మళ్లీ మరోసారి ఆయన క్లీన్‌చిట్‌తో బయటపడతారని కేజ్రీవాల్ అన్నారు. జైన్ ఎలాంటి కళంకం లేకుండా బయటపడాతారనే నమ్మకం తనకు ఉందన్నారు.
హవాలా కేసులో అరెస్ట్ చేసిన సత్యేంద్ర జైన్‌ను జూన్ 9 వరకూ కస్టడీకి అప్పగిస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆదేశించింది. సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
ఇదీ కేసు
సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలపై ఈడీ ఇటీవల విచారణ జరుపుతోంది. కొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో కొన్నిసోదాలు నిర్వహించినప్పుడు అక్కడి కంపెనీ సాయంతో మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాలు జరిపినప్పుడే దాదాపుగా రూ. నాలుగు కోట్ల 81 లక్షల సొమ్ము సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన సంస్థల్లోకి అక్రమంగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ సొమ్మును అప్పుడే అటాచ్ చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.
Also Read: Russia Ukraine War: రష్యాకు భారీ ఎదురుదెబ్బ- ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధ సాయం!
Also Read: UPSC 2021: ఎంత పనిచేశారు భయ్యా! ఐశ్వర్య అంటే అమ్మాయ్ అనుకున్నాంగా!