CM KCR: సీఎం కేసీఆర్ తో బీజేపీ ఎంపీ భేటీ, షాక్ ఎవరికీ బ్రేక్ ఎవరికీ!
సీఎం కేసీఆర్ తో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, రైతు సంఘం నేత రాకేష్ సింఘ్ తికాయత్ భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
CM KCR: దిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ తో బీజేపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ స్వామి(Subramanian Swamy) గురువారం భేటీ అయ్యారు. రైతు ఉద్యమకారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిథి రాకేష్ సింఘ్ తికాయత్(Rakesh Singh Tikayat) కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నివాసంలో లంచ్ ఆతిథ్యాన్ని సుబ్రమణియన్ స్వామి, తికాయత్ ఇరువురు నేతలు స్వీకరించారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై సీఎం కేసీఆర్ తో చర్చించినట్లు సమాచారం.
Rajya Sabha member and noted Economist Sri Subramanian @Swamy39 Ji met with Telangana CM Sri KCR garu in New Delhi today pic.twitter.com/Sxr8ajk5MK
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 3, 2022
పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా
బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల మహారాష్ట్ర(Maharastra)లో పర్యటించి సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackery)తో పాటు ఎన్సీపీ(NCP) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar)తో భేటీ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin) ను కూడా కలిశారు.
మారుతున్న రాజకీయ సమీకరణాలు
దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నారు. కేంద్రంలోని బీజేపీ(BJP) పాలనపై ప్రాంతీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. రాష్ట్రాల హక్కులు సాధించుకునేందుకు కేంద్రంతో పోరాడుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఏక తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ దిల్లీ(Delhi)లో కీలక భేటీ జరిగింది. బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుబ్రమణియన్ స్వామి కేంద్రాన్ని అనేక అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీగా ఏప్రిల్ 24తో సుబ్రమణియన్ స్వామి పదవీ కాలం ముగియనుంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ కావటంతో ఆసక్తికరంగా మారింది.
Also Read: Murder Sketch Politics : "మర్డర్ స్కెచ్" చుట్టూ ఊహించని రాజకీయం !చివరికి ఎవరు ఇరుక్కుంటారు ?