IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Indira Gandhi International Airport:ఢిల్లీలో కురిసిన కుంభ వృష్టి అంతర్జాతీయ విమాశ్రయ టెర్మినల్‌ను కుప్పుకూల్చింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఆరుగురు గాయపడ్డారు.

Delhi Rains: ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరుతి రుతుపవాల ఢిల్లీ వరకు వ్యాపించిన సంగతి తెలిసింది. దీంతో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలు కారణంగా ఢిల్లీ నీట మునిగింది. ఉదయం నాలుగున్నర నుంచి వర్షం పడుతూనే ఉంది. నగరంలో ఎక్కడ చూసిన మేకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
వేకువ జామున కురిసిన గాలి వానకు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే రిస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కూలిపోయిందనే సమాచార తమకు వేకువజామున ఐదున్నరకు అందిందని తెలిపారు. విషయం తెలుకున్న వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి సిబ్బందితో చేరుకున్నట్టు వెల్లడించారు. మొదట నలుగుర్ని రెస్క్యూ చేశామని తర్వాత శిథిలాల కింద మరో ఇద్దర్ని గుర్తించి బయటకు తీసినట్టు వివరించారు. అదే టైంలో ఒకరు మృతి చెందినట్టు కూడా గుర్తించామని పేర్కొన్నావారు.
"ఈ ఉదయం 5.30 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయినట్లు అగ్నిమాపక శాఖకు ఫోన్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలను సంఘటనా స్థలానికి పంపించాం. ఇప్పటి వరకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. ఒక వ్యక్తిని మాత్రం రక్షించడానికి చాలా సమయం పట్టింది.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని రకాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో షటిల్ సర్వీసులను ఢిల్లీ మెట్రో నిలిపివేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

