ఢిల్లీలో సరిబేసి విధానం, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Air Pollution: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో నవంబర్ 13 నుంచి సరిబేసి విధానం అమలు చేయనున్నారు.
![ఢిల్లీలో సరిబేసి విధానం, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi Air Pollution Odd-Even In Delhi From Nov 13 For A Week As Pollution Rises ఢిల్లీలో సరిబేసి విధానం, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/eef8039fdb9bbd1f3afbbba1a0f0e5481699260120781517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi Air Pollution:
వారం రోజుల పాటు సరి-బేసి విధానం
ఢిల్లీలో కాలుష్యాన్ని (Delhi Pollution) కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13వ తేదీ నుంచి సరిబేసి వాహనాల విధానాన్ని (Delhi odd-even scheme) అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) అధికారులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తరవాత పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. కాలుష్య నియంత్రణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోపాల్ రాయ్ తెలిపారు.
"ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు సరిబేసి వాహనాల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 20 వరకూ ఈ విధానం కొనసాగుతుంది"
- గోపాల్ రాయ్, ఢిల్లీ పర్యావరణ మంత్రి
#WATCH | Delhi Environment Minister Gopal Rai says "In view of air pollution, the Odd-Even vehicle system will be applicable for one week from 13th to 20th November..." pic.twitter.com/IPBTrxoOOE
— ANI (@ANI) November 6, 2023
ఢిల్లీలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాలుష్య స్థాయి కొంత మేర తగ్గే అవకాశముందని వెల్లడించింది. అధికారులు అంచనా వేసినట్టుగా వేగమైన గాలులు వీస్తే కాలుష్యం తగ్గిపోతుందని గోపాల్ రాయ్ తెలిపారు.
"వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 7 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇదే జరిగితే కాలుష్యం కొంత వరకూ తగ్గిపోయే అవకాశముంది. నవంబర్ 8న గాలుల వేగం గంటకు 8-10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరవాత కాలుష్యం మరింత కట్టడి అయ్యే అవకాశాలున్నాయి"
- గోపాల్ రాయ్, ఢిల్లీ పర్యావరణ మంత్రి
#WATCH | Delhi Environment Minister Gopal Rai says "As per the forecast, the wind speed will be 12km/hour tomorrow, 7th November and if the speed reaches 10 to 12 km/hour, then there is a possibility that the level of pollution accumulated here might disperse. Similarly, the wind… pic.twitter.com/8N74LqfYcy
— ANI (@ANI) November 6, 2023
ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. Graded Response Action Plan (GRAP) చర్యలు తీసుకుంటోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేస్తోంది. మొత్తం నాలుగు దశల్లో ఈ చర్యలు అమలు చేయనుంది. ఇందులో స్టేజ్ 4 ని సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు. AQI 450 కన్నా ఎక్కువగా నమోదైతే వెంటనే ఈ చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోకి ట్రక్‌లు రావడంపై ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే ట్రక్‌లు తప్ప మిగతావి నగరంలోకి ఎంటర్ కావద్దని అధికారులు ఆదేశించారు.
Also Read: ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్, తెలంగాణ యువకుడితో సహా మరొకరు అరెస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)