By: ABP Desam | Updated at : 20 Jan 2023 04:12 PM (IST)
Edited By: jyothi
డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతిని ఈడ్చుకెళ్లిన కారు వీడియో వైరల్, పోలీసులపై సీఎం ఫైర్
Delhi News: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ ను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఆ వ్యక్తి తన కారు ఎక్కాలని బలవంతం చేశాడు. దానికి ఆమె ఆయనతో వాదనకు దిగారు. ఈ వాదన సాగుతుండగానే.. ఆమె చెయ్యి కారు విండోలో ఉండగానే అద్దాన్ని పైకి వేస్తూ వాహనాన్ని ముందుకు లాగించేశాడు. ఈ క్రమంలో కారుతోపాటు స్వాతిని ఈడ్చుకుంటూ వెళ్లి పోయాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ గేటు నెంబర్ 2 వద్దే ఈ ఘటన జరిగింది. సుమారు 10 నుంచి 15 మీటర్ల దూరం స్వాతిని ఈడ్చుకెళ్లాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ హరిశ్చంద్రను అరెస్టు చేశారు.
दिल्ली महिला आयोग की अध्यक्ष स्वाति मालीवाल के साथ राजधानी में हुई घटना का वीडियो अब हो रहा वायरल .......@ABPNews pic.twitter.com/Bl34HyjEOZ
— Nishant Chaturvedi (@nishant1994cha1) January 20, 2023
తెల్లవారుజామున 3.11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిమ్స్ గేటు నెంబర్ 2 ముందు తన వాహనం కోసం ఎదురు చూస్తున్న స్వాతి మలివాల్ ను తన వాహనంలో కూర్చోమని కారు డ్రైవర్ కోరాడు. మలివాల్ అతన్ని మందలిస్తున్న సమయంలో కారు డ్రైవర్ హరిశ్చంద్ర కారు అద్దాలను పైకి లేపాడు. దీంతో స్వాతి మలివాల్ చేయి కారులో ఇరుక్కుపోయింది. దీంతో కారు డ్రైవర్ 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అయితే ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. పోలీసులను ప్రశ్నించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దిల్లీలోని శాంతి భద్రతల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో వైరల్ గా మారినప్పటి నుంచి మహిళలకు భద్రత కరువైందంటూ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.
స్వాతి మలివాల్ స్పందిస్తూ.. దేవుడి దయ వల్లే తన ప్రాణాలు నిలిచాయని.. లేదంటే తన పరిస్థితి అంజలిలా మారేదని ఆవేదన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ 15 మీటర్ల దూరం వరకు తనను లాక్కెళ్లారని చెప్పారు.
పోలీసులు ఏమంటున్నారంటే..?
గరుడ 1 (దక్షిణ ఢిల్లీలో ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం) ద్వారా తెల్లవారుజామున 3.10 గంటలకు కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. పెట్రోలింగ్ వాహనం కోట్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిమ్స్ గేట్ నంబర్ 2 ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై తెల్లవారుజామున 3.05 గంటలకు మహిళను కారు డ్రైవర్ ఇబ్బంది పెట్టారని ఆ ఫోన్ సమాచారం. బెలెనో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో మహిళను ఇబ్బంది పట్టారు. తనతో పాటు కారులో కూర్చోమని అడిగాడని, వెంటనే వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మరోసారి తిరిగి వచ్చి ఆమెను కారులో కూర్చోమని అడిగాడు. ఆమె నిరాకరించి ఈసారి మందలించింది. కిటికీలోంచి అతన్ని పట్టుకొని చెడామడా తిట్టేసింది. అతన్ని పట్టుకోవడానికి యత్నించింది. అంతే డ్రైవర్ వేగంగా కిటికీని పైకి లేపి, వాహనాన్ని స్టార్ట్ చేశాడు. ఆమె చెయ్యి కిటికీలో ఉండిపోయిన సంగతి కూడా చూసుకొని లాక్కొని వెళ్లిపోయాడు. ఆమెను 10-15 మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి