Congress CWC Meeting : ఇంత ఘోరంగా ఎలా ఓడిపోయాం ? ఆదివారం సోనియా సమీక్ష !
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహించనుంది. సీనియర్ అసంతృప్తి నేతల నిరసనలతో ఈ సమావేశం ఎలా జరగనుందనే ఆసక్తి ప్రారంభమయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం సాయంత్రం సమావేసం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో జీ -23 పేరుతో కొంత మంది నేతలు గాంధీ కుటుంబంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిలో కొందరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వారంతా సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణల కోసం వారు మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గళమెత్తాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ములాయం, మన్మోహన్ బీజేపీకి ఓటేశారట ! ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కంటే ముందే సోనియా ఇంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పని అయిపోయిందని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని ఎన్నో రోజులుగా కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలన్నీ తాజా ఎన్నికల ఫలితాలతో బెడిసికొట్టినట్లయ్యింది. 2014 నుంచి దేశంలో 45 సార్లు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే హస్తం పార్టీ కేవలం నెగ్గింది ఐదు మాత్రమే. ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీనికి తోడు పార్టీలోని సీనియర్లు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి మరో సవాల్‌గా మారారు.
మెజార్టీలో నేషనల్ ఛాంపియన్ ఆ బీజేపీ ఎమ్మెల్యేనే ! ఎన్ని లక్షల ఓట్ల మెజార్టీ అంటే ?
కాగా.. 403 స్థానాలున్న యూపీలో 02 సీట్లు, 117 సీట్లున్న పంజాబ్ రాష్ట్రంలో 18, 70 సీట్లున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 సీట్లు, గోవాలో 20 సీట్లుంటే.. 12, మణిపూర్ లో 60 అసెంబ్లీ సీట్లుంటే 06 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. యూపీపై ఎలాంటి ఆశలు లేకపోయినా... పంజాబ్‌లో అధికారాన్ని పోగొట్టుకోవడం ఆ పార్టీ ఆశనిపాతంలా మారింది. ఉత్తరాఖండ్‌లో గెలిచే అవకాశాలు ఉన్నా స్వయం తప్పిదాలతో ఓటమి కొని తెచ్చుకున్నట్లయింది.
సాహెబ్"కు కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ! అలా జరిగే చాన్సే లేదట
ఎన్నికల ఫలితాల రోజున.. ప్రజా తీర్పును తాము గౌరవిస్తారమని.. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రియాంకా గాంధీ కూడా అలాగే ట్వీట్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఏమైననా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో వేచి చూడాలి !