(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Cases India: కొత్తగా 3 వేల కరోనా కేసులు- ఒక్కసారిగా పెరిగిన పాజిటివిటీ రేటు
Coronavirus Cases India: దేశంలో కొత్తగా 3,303 కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus Cases India: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 3,303 కరోనా కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
COVID-19 | India reports 3,303 fresh cases and 2,563 recoveries, in the last 24 hours. Active cases 16,980
— ANI (@ANI) April 28, 2022
Daily positivity rate (0.66%) pic.twitter.com/29SNk65cOq
- యాక్టివ్ కేసులు: 16,980
- మొత్తం మరణాలు: 523693
- మొత్తం కేసులు: 4,30,68,799
- రికవరీలు: 4,25,28,126
యాక్టివ్ కేసుల సంఖ్య 16,980కి చేరింది. మొత్తం కేసుల్లో ఈ శాతం 0.04గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.66%గా ఉంది.
తాజాగా 2,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,25,28,126కు పెరిగింది. రికవరీ రేటు 98.74%గా ఉంది.
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం 19,53,437 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,40,75,453కు చేరింది.
ప్రధాని భేటీ
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న వేళ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున అలసత్వం వహించరాదని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను భారత్ దీటుగా ఎదుర్కొందని మోదీ అన్నారు.