ఆదిత్య L1 ప్రయోగానికి మొదలైన కౌంట్‌డౌన్, తిరుమల శ్రీవారి ఆలయంలో సైంటిస్ట్‌ల పూజలు
Aditya-L1 Solar Mission: ఇస్రో చేపట్టనున్న ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
Aditya-L1 Solar Mission:
కౌంట్‌డౌన్..
శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించనున్న ఆదిత్య ఎల్ - 1 ప్రయోగాన్ని పురస్కరించుకొని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్., డాక్టర్ మోహన్లు ఆదిత్య ఎల్ - 1 ఉపగ్రహ నమూనాతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిత్య ఎల్ - 1 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్య ఎల్ 1 సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆదిత్య ఎల్-1 నమూనాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఇస్రో డైరెక్టర్లను ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రయాన్-3 సక్సెస్ తరవాత ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రయోగం Aditya L1. సెప్టెంబర్ 2 న ఉదయం 11.50 నిముషాలకు దీన్ని లాంఛ్ చేయనున్నారు. ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. సూర్యుడిపై అధ్యయనానికి భారత్ పంపిస్తున్న తొలి శాటిలైట్ ఇదే.
ఈ ఆదిత్య ఎల్ - 1 శాటిలైట్ ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ - 1) వద్ద ఉంచి అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధన చేయనున్నారు. ఎల్ - 1 పాయింట్ వద్ద ఆదిత్య శాటిలైట్ ను మోహరించడం ద్వారా నిరంతరాయంగా శాటిలైట్ సూర్యుడిపై పరిశోధన చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్ పాయింట్ - 1 ఉంటుంది.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
— ISRO (@isro) August 28, 2023
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
రిహార్సల్ లాంఛ్ పూర్తైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
#WATCH | Chennai, Tamil Nadu | ISRO chief S Somanath speaks on Aditya-L1 Mission; says, "We are just getting ready for the launch. Rocket and satellite are ready. We completed the rehearsal for the launch. Tomorrow we have to start the countdown for the launch day after… pic.twitter.com/iJTqxDZKkn
— ANI (@ANI) August 31, 2023