అన్వేషించండి

Cough Syrup: దగ్గు సిరప్ పై కేంద్రం కొత్త నిబంధనలు - ఎగుమతులు చేసే ముందు ఆ పని చేయాల్సిందే!

Cough Syrup: దగ్గ మందు ఎగమతిదారులు తమ ఉత్పత్తులను విదేశాలకు పంపించే ముందు కచ్చితంగా ప్రభుత్వ ల్యాబ్ లలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Cough Syrup: భారత్ లోని కొన్ని కంపెనీల్లో తయారు చేసిన దగ్గు మందుల కారణంగా పలు దేశాల్లో మరణాలు సంభవించడం దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఇలాంటి దగ్గు సిరప్ లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చింది. దగ్గు సిరప్ లపై ప్రభుత్వ ల్యాబ్ లలో అనుమతిని తప్పనిసరి చేసింది. ముఖ్యంగా దగ్గు మందును వేరే దేశాలకు ఎగుమతి చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా ప్రభుత్వ ల్యాబ్ లో అనుమతి పొందిన తర్వాతనే ఎగుమతి చేసుకోవచ్చని సూచించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని వివరించింది. దగ్గు మందు ఎగుమతి దారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది. అలాగే ఆ సర్టిఫికేట్ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయని వివరించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి అని పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, ఆర్డీటీఎల్ పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్ లలో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతి దారులకు స్పష్టం చేసింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అనేక రకాల ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై ప్రభుత్వం రాజీ పడబోదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే ఎగుమతుల కంటే ముందు దగ్గు మందుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. 2022-23లో భారత్ 17.6 బిలియన్ డాలర్ల విలువైన దగ్గు సిరప్ లను పులు దేశాలకు ఎగుమతి చేసింది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget