అన్వేషించండి

Coronavirus India Updates: దేశంలో తగ్గిన కరోనా వ్యాప్తి...కొత్తగా 25,467 కరోనా కేసులు, 354 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 25467 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. రోజూవారీ కేసులు తగ్గుతున్నాయి. తాజా కేసులు నిన్నటి కన్నా కాస్త పెరిగినా కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 మందికి కరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,74,773 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 3,19,551 యాక్టివ్ కేసులు ఉండగా, 3,17,20,112 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

యాక్టివ్ కేసులు 1.29 శాతం మాత్రమే

సోమవారం కరోనాతో 354 మంది చనిపోయారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,35,110కు చేరింది. తాజాగా 39,486 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా, రికవరీ రేట్ 97.37 శాతం ఉంది. దేశంలో కరోనా కేసుల క్రియాశీల రేటు తగ్గింది. రికవరీ రేటు మెరుగ్గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు ఒక శాతం దిగువకు వచ్చింది. 2020 మార్చి తర్వాత క్రియాశీల రేటు ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి. 

Also Read: TS Covid News: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్.. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్.. తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తం..

58.89 కోట్ల డోసులు పంపిణీ

దేశంలో కొత్తగా 25,467 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24 కోట్లకు చేరింది.  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. సోమవారం 63,85,298 మంది కోవిడ్ టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే దేశంలో 16,47,526 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 50,91,98,925కి చేరినట్లు చెప్పింది.

Also Read: Covid Third Wave: అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్... పిల్లలపై ఎక్కువ ప్రభావం... కేంద్రానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక

ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం

కరోనా వైరస్ థర్డ్ వేవ్ సంకేతాల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 5,13,864 మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైరస్​ధాటికి మరో 7585 మంది మరణించారు.  ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,32,79,064కి చేరాయి. మరణాల సంఖ్య 44,53,064కు పెరిగింది. 

Also Read: Petrol-Diesel Price, 24 August 2021: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో తాజా ధరలివే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Embed widget