అన్వేషించండి

Covid Third Wave: అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్... పిల్లలపై ఎక్కువ ప్రభావం... కేంద్రానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక

దేశంలో ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కాస్త తగ్గినా అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఖాయంగా కనిపిస్తుంది. అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక అందించింది.

 

దేశంలో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక పంపింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చాయి. వీటి ఉద్ధృతితో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని పేర్కొంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ కేంద్రాన్ని హెచ్చరించింది. 

Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!

పిల్లలపై ప్రభావం

కరోనా థర్ద్ వేవ్ తో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీచేసింది. వైద్య పరంగా సంసిద్ధతంగా ఉండాలని కేంద్రానికి సూచనలు చేసింది. పిల్లలకు వైద్య సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు, వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని నివేదికలో పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 82% శిశువైద్యుల కొరత ఉందన్న కమిటీ... కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63% ఖాళీలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన డేటాపై ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చని కేంద్రానికి నివేదికలు పంపంది. 

Also Read: Prohibited Lands: అక్షరం జోడించి అడ్డంగా రిజిస్ట్రేషన్... కోట్లలో ఖజానాకు గండి ... ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు

దేశంలో కొత్తగా 25 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం.... కొత్త కేసులు 19 శాతం మేర తగ్గాయి. కొత్తగా 25072 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య సుమారు ఐదు నెలల కాలంలో కనిష్ఠానికి తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో  25,072 మంది కరోనా బారిన పడ్డారు. 389 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు దేశంలో 4,34,756 మంది మృతి చెందారు. ఆదివారం 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరాయి. కొద్ది రోజులుగా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 7,95,543 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు పంపిణీ అయిన కరోనా డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది. 

 

 Also Read: Red Sandal Seized: కర్నూలులో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టివేత

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget