Coronavirus Update India: దేశంలో కొత్తగా 2,745 కరోనా కేసులు- ఆరుగురు మృతి
Coronavirus Update India: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus Update India: దేశంలో కొత్తగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 2236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 2,745 fresh cases, 2,236 recoveries, and 6 deaths, in the last 24 hours.
— ANI (@ANI) June 1, 2022
Total active cases are 18,386. Daily positivity rate 0.60% pic.twitter.com/EC3ixma3ZE
- మొత్తం కరోనా కేసులు: 4,31,60,832
- మొత్తం మరణాలు: 5,24,636
- యాక్టివ్ కేసులు: 18,386
- రికవరీల సంఖ్య: 4,26,17,810
వ్యాక్సినేషన్:
దేశవ్యాప్తంగా తాజాగా 10,91,110 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,57,20,807కు చేరింది. ఒక్కరోజే 4,55,314 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.