By: ABP Desam | Updated at : 06 Apr 2023 09:20 PM (IST)
Edited By: venkisubbu143
అనిల్ నిర్ణయం బాధించింది- ఏకే ఆంటోనీ ( Image Source : Getty Images )
Anil Antony Joining BJP: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. దీనిపై ఏకే ఆంటోనీ (AK Antony) స్పందించారు. తన కుమారుడి నిర్ణయం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
అనిల్ నిర్ణయం బాధించింది
తిరువనంతపురంలో ఏకే ఆంటోనీ మీడియాతో మాట్లాడుతూ.. “బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయం నన్ను బాధించింది. ఇది చాలా తప్పుడు నిర్ణయం. భారతదేశానికి ఐక్యత, మత సామరస్యమే ఆధారం. 2014 తర్వాత, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, బీజేపీ నేతలు లౌకికవాదాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నారు. బీజేపీ ఏకరూపతను మాత్రమే నమ్ముతుంది, వారు దేశ రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తున్నారు" అని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎప్పటికీ నెహ్రూ కుటుంబానికి విధేయుడినేనని ఆయన స్పష్టంచేశారు.
బీజేపీని తుదిశ్వాస వరకు వ్యతిరేకిస్తా
దేశాన్ని విభజించి ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) భావజాలానికి తాను ఎప్పటికీ మద్దతు ఇవ్వబోనని ఆంటోనీ చెప్పారు. మతపరమైన, విభజన ఎజెండా కలిగిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను తుది శ్వాస విడిచే వరకు వ్యతిరేకిస్తానని తెలిపారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
ఇందిరా గాంధీ నాకు స్ఫూర్తి
రాజకీయాల్లోకి రావాలని తనను ప్రోత్సహించిన ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తి పొందానని ఏకే ఆంటోనీ తెలిపారు. విధానపరమైన అంశంలో ఒక్కసారి మాత్రమే ఆమెతో విభేదించినట్లు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి ఆమెను మరింత గౌరవించానని వెల్లడించారు. ‘నేను రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నాను. ఎంతకాలం జీవిస్తానో తెలియదు. అయితే నేను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ కోసమే బతుకుతాను’ అని ఆంటోనీ స్పష్టంచేశారు. తన కుమారుడి తీసుకున్న నిర్ణయంపై ఇకపై మాట్లాడబోనని, తన వ్యక్తిగతాన్ని మీడియా కూడా గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
#WATCH | "Anil’s decision to join BJP has hurt me. It is a very wrong decision. India’s base is unity and religious harmony. After 2014, Modi govt came to power, they’re systematically diluting diversity and secularism....": AK Antony on his son Anil Antony joining BJP pic.twitter.com/6Gg03qvZY0
— ANI (@ANI) April 6, 2023
బీజేపీలో చేరిన వెంటనే కాంగ్రెస్‌పై విమర్శలు
గురువారం బీజేపీలో చేరిన అనిల్ ఆంటోనీ కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. "ఒక కుటుంబం కోసమే పనిచేస్తున్నామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నమ్ముతారు. కానీ దేశం కోసం పనిచేస్తున్నానని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో ఉంచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చాలా స్పష్టత ఉంది. భారతీయ యువకుడిగా, దేశ నిర్మాణం కోసం జాతీయ సమైక్యత కోసం ప్రధానమంత్రికి సహకరించడం నా బాధ్యత అని నేను భావిస్తున్నాను" అని మీడియాకు తెలిపారు. కాగా.. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో అనిల్ ఆంటోనీ ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడారు.
అనిల్ ఆంటోనీని టార్గెట్ చేసిన కేరళ కాంగ్రెస్
అనిల్ తన తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీకి ద్రోహం చేశాడని కేరళ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ బాధ్యతలు అప్పగించలేదని, అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే విషయం కాదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఈ రోజు (మాండీ గురువారం) అంటే పవిత్ర గురువారం జుడాస్ (ఇస్కారియోట్) 30 వెండి నాణేల కోసం యేసుక్రీస్తుకు ద్రోహం చేశాడు. ఈ రోజున ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇది (అనిల్ బీజేపీలో చేరడం) కూడా అలాంటి సంఘటనగానే చూడాలి" అన్నారు.
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో బీర్ టిన్ ఫొటో పెట్టాడు, బుక్ అయ్యాడు - కాస్త చూసుకోవాలిగా బ్రో
New Parliament Carpet: పార్లమెంట్లోని కార్పెట్ల తయారీకి 10 లక్షల గంటలు, 60 కోట్ల అల్లికలతో డిజైన్
New Rs 75 Coin: కొత్త పార్లమెంట్లో రూ.75 కాయిన్ని విడుదల చేసిన ప్రధాని
Wrestlers Protest: తుపాకులతో కాల్చి చంపేయండి, ఢిల్లీ పోలీసులపై బజ్రంగ్ పునియా ఫైర్
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!