Adhir Ranjan : పొరపాటున నోరు జారా - రాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ ! వివాదం ముగిసినట్లేనా ?
రాష్ట్రపతికి క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి. పొరపాటున నోరు జారానని లేఖ రాశారు.
Adhir Ranjan : రాష్ట్రపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసి క్షమాపణ కోరారు. మీరు నిర్వహిస్తున్న పదవిని ఉద్దేశించి పొరపాటున సరికాని పదాన్ని వాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో అధిర్ రంజన్ పేర్కొన్నారు. పొరపాటున నోరు జారి ఆ పదాన్ని వాడినందుకు క్షమాపణ కోరుతున్నానని దీన్ని మీరు అంగీకరించాలని కాంగ్రెస్ నేత ఆ లేఖలో కోరారు.
రాజకీయాల్లో కలకలం రేపిన అధిర్ రంజన్ వీడియో వ్యాఖ్యలు
అధిర్ అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్నిగా వ్యాఖ్యానించిన వీడియో క్లిప్ పెను దుమారం రేపింది. అధిర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన చేపట్టారు. అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.తాను పొరపాటున నోరు జారానని, చిన్న అంశాన్ని కాషాయ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుయుక్తితోనే బీజేపీ దిగజారి వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సోనియా క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ - రాజకీయం చేశారని అధిర్ ఆరోపణ
రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం కాగానే తాను నోరు జారానని వివరణ ఇచ్చానని గుర్తు చేశారు. రాష్ట్రపతిని అవమానించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని అన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచాలని తాను అనుకోనని చెప్పారు. పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
వివాదం ముగిిపోతుందా ?
రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం కాగానే తాను నోరు జారానని వివరణ ఇచ్చానని గుర్తుచేశారు. రాష్ట్రపతిని అవమానించాలనే దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని అన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచాలని తాను అనుకోనని చెప్పారు. పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధిర్ క్షమాపణ చెప్పడంతో బీజేపీ ఈ వివాదాన్ని ముగిస్తుందో లేకపోతే .. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని పట్టుబడుతుందో వేచి చూడాల్సి ఉంది.