Salman Khurshid: హిందుత్వను ఐసిస్&బోకో హరామ్‌తో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఖుర్షీద్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ అయోధ్య తీర్పుపై రాసిన కొత్త పుస్తకంలో చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ సల్మాన్ ఖుర్షిద్ కొత్త పుస్తకం సంచలనాలకు సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. హిందూ సమాజాన్ని ఐఎస్‌ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చి చూపడం ఆగ్రహానికి గురి అవుతోంది. ఆయోధ్య తీర్పుపై తన పుస్తకంలోని ద సాఫ్రాన్ స్కై అనే అధ్యయంలో ఖుర్షిద్ ఈ కామెంట్స్ చేశారు.
రుషులు, సాధువులకు తెలిసిన సనాతన ధర్మం, హిందూయిజం ఎప్పుడో పక్కకు వెళ్లిపోయింది. ఈ మధ్య కాలంలో జిహాదిస్ట్ ఇస్లాం గ్రూప్ ఐఎస్‌ఐఎస్, బోకో హారమ్ మాదిరిగా మారిపోయింది. ఇందులో రాజకీయం జోక్యం చేసుకుని ఈ పరిస్థితి వచ్చింది. - తన కొత్త పుస్తకంలో ఖుర్షీద్
ఖుర్షీద్ ప్రకటనపై మండిపడుతోంది భారతీయ జనతాపార్టీ. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ... ఇది కాంగ్రెస్ నిజమైన ఆలోచనకు ప్రతి బింబిస్తుందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు హిందువులతో ఆర్టిఫిషియల్‌గా గౌరవం చూపిస్తున్నారన్నారు. ఇలా చేసి ఐఎస్‌ఐఎస్ ఆలోచనలను చట్టబద్దం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన హిందూ రాష్ట్ర ఆలోచననను తోసిపుచ్చిందని... లౌకిక వ్యవస్థలోని సున్నితమైన మతపర ఆందోళనలను ఆచరణాత్మకంగా అమలు చేసిందన్నారు ఖుర్షిద్
గతవారం విడుదలైన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్‌టైమ్స్ పేరుతో విడుదలైన పుస్తకంలో చాలా అంశాలు ప్రస్తావించారు. అయోధ్యవివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రశంసించారు ఖుర్షిద్. న్యాయసూత్రాలకు కట్టుబడి, ఎప్పటి నుంచో దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న గాయాన్ని నయం చేయడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు.
ముస్లిం వాదన కంటే హిందువుల కారణాన్ని ఒప్పించగలమని సుప్రీంకోర్టు భావించి ఉండొచ్చు. కానీ దీన్ని ఓటమిలా కాకుండా సయోధ్యకు అవకాశంగా ముస్లింలు భావించేలా సుప్రీం తీర్పు చెప్పింది. - సల్మాన్ ఖుర్షీద్
తాను భాగమైన అంశంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో ప్రజలకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు సల్మాన్ ఖుర్షీద్. ఈ అంశంలో తీర్పు రావడానికి వందల ఏళ్లు పడుతుందని అంతా భావించారు కానీ... తీర్పు వచ్చిన తర్వాత అందులో ఏముందో తెలియకుండానే కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పూర్తి వివరాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చాను. - సల్మాన్ ఖర్షీద్
అయోధ్యలో బాబ్రీమసీదు ఉన్న స్థలంలో రామ మందిర నిర్మాణానికి 2019నవంబర్9న సుప్రీం కోర్టు అనుమతిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయ ప్రదేశంలో కొత్త మసీదు నిర్మించడానికి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.
ALSO READ: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది
ALSO READ: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు