Congress Chintan Shivir: ఈవీఎంల రద్దు, కుటుంబానికి ఒక్క టికెట్, 5 ఏళ్లు ఛాన్స్ - చింతన శిబిరంలో మరిన్ని కీలక నిర్ణయాలివే
Congress Chintan Shivir: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై చర్చ జరగగా, తాము అధికారంలోకి వస్తే ఈవీఎంలను రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.
Know Key decisions by Congress during 3-day Chintan Shivir: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంలో భాగంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిరం పేరుతో నిర్వహించిన సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఎన్నికల్లో ఓటములపై చర్చించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు.
సీడబ్ల్యూసీ చింతన శిబిరం సమావేశంలో పార్టీ వ్యూహాలు, ఓటములకు సంబంధించిన రిపోర్ట్, సరికొత్త నిర్ణయాలపై ఆరు ప్యానెల్స్ అందించిన వివరాలకు ఆమోదం తెలిపారు. భావజాల, ఆర్థిక పాలసీలు, సామాజిక అంశాలను సైతం పార్టీ నేతలు చర్చించారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం తెగిపోయిందని, దీన్ని తిరిగి గాడిన పెట్టాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. ప్రజలతో మమేకం కావాలని, వారి ఆకాంక్షలు తెలుసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై చర్చ జరగగా, తాము అధికారంలోకి వస్తే ఈవీఎంలను రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. 20 ప్రతిపాదనలతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
A compact task force will be setup to drive the process of internal reforms that are essential and that have been discussed in different groups here at Udaipur.
— Congress (@INCIndia) May 15, 2022
These reforms will focus on the 2024 Lok Sabha polls.
: Congress President Smt. Sonia Gandhi#NavSankalpShivir pic.twitter.com/HGer6HuoQr
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యాత్రను చేపట్టనున్నట్లుగా ఆదివారం (మే 15) తెలిపారు. దీని పేరు భారత్ జోడో యాత్ర అని తెలిపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ చింతన్ శిబిరం (Congress Chintan Shivir) చివరి రోజున పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొని అభిప్రాయాన్ని తెలిపిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
చింతన్ శిబిరంలో సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలివే..
ఒక్క కుటుంబం, ఒక్కటే టికెట్‌పై ఏకాభిప్రాయం కుదరింది. అయిదేళ్లు పనిచేసిన అనుభం ఉన్న నేతలు తమ కుటుంబసభ్యులకుగానీ, బందువులకు గానీ తమ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది
ఎవరైనా ఓ పదవిలో 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదని, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సీడబ్ల్యూసీ నిర్ణయం
50 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పార్టీలోని అన్ని స్థాయిలలో 50 శాతం పదవులు, అవకాశాలు కల్పించడం
కాంగ్రెస్ పార్టీ రైతులకు కనీస మద్దతు ధర, నిరుద్యోగిత సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, మైనార్టీలకు కలిపి పార్టీలోని అన్ని స్థాయిలలో 50 శాతం అవకాశాలు కల్పించాలి. అణగారిన వర్గాలు, మైనార్టీలలో పార్టీపై నమ్మకం పెంపొందించడానికి చర్యలు
ప్రతి స్థాయిలోనూ పార్టీ నేతల ప్రదర్శనను పరిశీలించేందుకు అంచనా విభాగం ఏర్పాటు ఏర్పాటుకు సీడబ్ల్యూసీ నిర్ణయం
ప్రజల సమస్యలు, ఎలక్షన్ మేనేజ్ మెంట్, జాతీయ స్థాయిలో శిక్షణకు విభాగం ఇలా కాంగ్రెస్‌లో మూడు కొత్త విభాగాలకు ప్రతిపాదన. ఖాళీగా స్థానాలు, పోస్టులను 90 నుంచి 120 రోజుల్లో భర్తీ చేయడం
All of us - young and old, will participate in the Bharat Jodo Yatra. The yatra is to strengthen the bonds of social harmony and to preserve the foundational values of our Constitution.
— Congress (@INCIndia) May 15, 2022
: Congress President Smt. Sonia Gandhi#NavSankalpShivir pic.twitter.com/O3vbXgSkXm
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహణ. అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయం
జూన్ 15 నుంచి రెండో దశ జన్ జాగరణ యాత్రను జిల్లా స్థాయిలో ప్రారంభించాలని నిర్ణయం
రాజకీయంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, చర్చల కోసం సీడబ్ల్యూసీ నుంచే సలహా గ్రూప్ ఏర్పాటు చేయడం
పార్టీలో సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ అధ్యక్షులకు సహాయం చేసేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈవీంఎలకు స్వస్తి పలికి, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహణకు ఆమోదం
ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించడం, 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చలు జరిగాయి.