అన్వేషించండి

ASTRA Missile: అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన తేజస్ యుద్ధ విమానం

ASTRA Missile: లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ విమానం విజయవంతంగా అస్త్ర క్షిపణి ని ప్రయోగించింది.

ASTRA Missile: లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ దేశీయంగా అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. గోవా తీరం గగనతలంలో ఈ అస్త్ర క్షిపణిని పరీక్షించింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(LCA) తేజస్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, విమానం నుంచి దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో క్షిపణి విడుదల విజయవంతం అయింది.

ఈ దేశీయ క్షిపణి పరీక్షా ప్రయోగాన్ని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ADA), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్(DRDO), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) టెస్ట్ డైరెక్టర్, శాస్త్రవేత్తలతో పాటు సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్‌ అండ్ సర్టిఫికేషన్(CEMILAC), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ అధికారులు పర్యవేక్షించారు. తేజస్ యుద్ధ విమానం అస్త్ర క్షిపణిని ప్రయోగించే సమయంలో తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పర్యవేక్షించారు. 

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ అస్త్ర క్షిపణి.. సూపర్ సోనిక్ వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి తయారు చేసిన అత్యాధునిక బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. ఈ అత్యాధునిక అస్త్ర క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీ(DRDL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్(RCI), DRDO సహా ఇతర ప్రయోగశాలలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల నుంచి స్వదేశీ అస్త్ర బీవీఆర్ క్షిపణి ప్రయోగం.. ప్రధాని మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ బారత్ కార్యక్రమంలో భాగమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. అస్త్ర క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థలను, పరీక్షించిన అన్ని విభాగాల వారిని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అభినందించారు. 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Phone Tapping Allegation: నా ఫోన్ ట్యాప్ అవుతోంది, అందులోనే సాక్ష్యాలు.. సీక్రెట్స్ బయటపెడతా: రాహుల్ గాంధీ ఆరోపణలు
నా ఫోన్ ట్యాప్ అవుతోంది, అందులోనే సాక్ష్యాలు.. సీక్రెట్స్ బయటపెడతా: రాహుల్ గాంధీ ఆరోపణలు
Tamil Nadu CM Vijay TVK MLAs Controversy: సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget