By: ABP Desam | Updated at : 26 Mar 2022 02:06 PM (IST)
బిడ్డ మృతదేహంతో పది కిలోమీటర్ల నడక - చత్తీస్‌ఘడ్‌లో ఓ తండ్రి కడుపుకోత !
అది చత్తీస్‌ఘడ్‌లోని లఖన్ పూర్ ప్రాంతం. ఓ నిరుపేద తండ్రి తన ఏడేళ్ల కుమార్తెను భుజలపై వేసుకుని వెళ్తున్నాడు. అతను ఎంతో విషాదంలో ఉన్నట్లుగా ఉన్నాడు. భుజం మీద తల వాల్చేసిన ఆ బిడ్డ చలనం లేకుండా ఉంది.ఆ తండ్రి ఆమెను అంతే భారంగా మోసుకెళ్తున్నాడు. చాలా మంది పట్టించుకోలేదు కానీ.. కొంత మంది ఆ తండ్రి కష్టాన్ని చూసి.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలిసిన తర్వాత వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆ తండ్రి మోసుకెళ్తోంది తన బిడ్డనే కానీ.. ప్రాణాలు లేని బిడ్డను. అప్పటికే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అతను తన బిడ్డ మృతదేహాన్ని అలా భుజాల మీద వేసుకుని వెళ్తున్న వీడియో వైరల్ అయింది.
చత్తీస్‌ఘడ్‌లోని సుగృజా జిల్లాలోని లిఖన్ పూర్ ఉంది. అక్కడికి దగ్గర్లో అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె కొద్ది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. స్థానిక వైద్యుల వద్దకు చిన్నారిని తీసుకెళ్లారు. అయిన్పటికీ జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం లఖాన్‌పుర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయులు 60 కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకొని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు.
Surguja: Chhattisgarh Health Min TS Singh Deo orders probe after video of a man carrying body of his daughter on his shoulders went viral
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 26, 2022
Concerned health official from Lakhanpur should have made the father understand to wait for hearse instead of letting him go, Deo said(25.3) pic.twitter.com/aN5li1PsCm
వైద్యులు మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా వినిపించకోలేదని.. నిమిషాల్లోనే బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయాలను లఖన్ పూర్ పీహెచ్సీ వైద్యులు చెప్పారు. అయితే ఆ బిడ్డతండ్రి కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చత్తీస్ ఘడ్ ఆరోగ్య మంత్రి సింగ్ దేవ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాభారధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
భారత్‌లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఒకరిస్సాలో ఓ వ్యక్తి చనిపోయిన తన భార్యను భుజనా వేసుకుని నడుచుకుంటూ వందల కిలోమీటర్లు వెళ్లినఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్అయింది. ఈ మార్చిలో రాయగడలో కొడుకు మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్లిన మరో తండ్రి ఘటన వైరల్ అయింది.
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!