మహిళల అకౌంట్లలోకి నేరుగా రూ.15 వేలు జమ చేస్తాం, కాంగ్రెస్ కీలక ప్రకటన
Chhattisgarh Election: అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రకటించింది.
Chhattisgarh Election 2023:
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రకటన..
ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Election) కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఓ విడత పోలింగ్ పూర్తి కాగా నవంబర్ 17వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ (Chief Minister Bhupesh Baghel ) ఈ ప్రకటన చేశారు. ఇటీవలే బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే వివాహిత మహిళలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆ మేనిఫెస్టోలో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే భూపేశ్ ఈ ప్రకటన చేశారు. దీపావళి సందర్భంగా ఈ శుభవార్త చెప్పారు.
"దీపావళి పండుగ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాం. మహిళల సాధికారత కోసం ఆ లక్ష్మి దేవి కటాక్షంతో కొత్త హామీ ఇస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఏటా మహిళలకు రూ.15వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ నగదు నేరుగా వాళ్ల ఖాతాల్లోకే వెళ్తుంది. ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజన పథకం కింద ఈ సాయం అందిస్తాం"
- భూపేశ్ భగేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद।
— Bhupesh Baghel (@bhupeshbaghel) November 12, 2023
श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः॥ pic.twitter.com/gUbN26lbNR
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 7వ తేదీన 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో ఛత్తీస్‌గఢ్ ఒకటి. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో మరోసారి అధికారంలోకి రానుంది. కానీ కాంగ్రెస్ సీట్లు కోల్పోగా, బీజేపీ బలోపేతం కానుందని తాజా సర్వేలో తేలింది. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP News Cvoter Final Opinion Pollలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలుడగా.. ఇందులో అధికార కాంగ్రెస్‌కి 45- 51 సీట్లు రాగా, ప్రతిపక్ష బీజేపీకి 36 నుంచి గరిష్టంగా 42 స్థానాలు వస్తాయని తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు అంటే.. ఛత్తీస్ గఢ్ ల మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వే చెబుతోంది. సెంట్రల్ ఛత్తీస్ గఢ్ లో 64 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈ రీజియన్ లో కాంగ్రెస్ హవా కొనసాగనుంది. అధికార కాంగ్రెస్ కు 34-38 సీట్లు, 45.6శాతం ఓట్లు పోల్ కానున్నాయి. బీజేపీకి 23-27 సీట్లు రాగా, 42 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా తక్కువ సీట్లకు పరిమితం కానుండగా, బీజేపీ ఈ రీజియన్ లో భారీగా ఓటు షేర్ తో పాటు సీట్లు సైతం కొల్లగొట్టేలా కనిపిస్తోంది.