Chelembra Bank Robbery: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనం ఇదే! ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Chelembra Bank Robbery: దేశంలో ఇప్పటివరకు జరిగిన బ్యాంకు దొంగతనాల్లో అతిపెద్దది ఏదో తెలుసా? ఈ కేసు వింటే మీరు షాకవడం మాత్రం పక్కా.
Chelembra Bank Robbery:
దేశంలో రోజూ వందల సంఖ్యలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు వాటిని ఛేదించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇన్ని సంవత్సరాల మన ఇండియన్ క్రైమ్ హిస్టరీలో అతి పెద్ద బ్యాంకు దొంగతనం ఏదో మీకు తెలుసా. పోలీసులకు చిక్కకుండా ఆ దొంగలు వేసిన ట్రాప్ లు అయితే ఏ థ్రిల్లర్ మూవీకి అసలు తీసిపోవు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనంగా గుర్తింపు పొందిన ఆ కేస్ ఏంటో తెలుసుకుందాం.
కేరళలో
చేలంబ్రా బ్యాంక్.. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంటుంది. 2007 డిసెంబర్ 30 తెల్లవారుజామున ఓ లోకల్ పోలీస్‌కు కాల్ వచ్చింది. సర్ బ్యాంకు తెరిచి చూస్తే పెద్ద కన్నం ఉంది అది కూడా బ్యాంకు కింద ఫ్లోర్ నుంచి వచ్చింది. ఎంత పోయిందో తెలియదు.. మీరు అర్జంట్‌గా రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
వెళ్లి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. అన్ని బ్యాంకుల్లా కాకుండా ఆ బ్యాంకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న షాపు ఖాళీగా ఉంటే నలుగురు సభ్యులున్న ఓ బృందం వచ్చి ఆ షాపు రెంట్‌కి అడిగి తీసుకుంది. అడ్వాన్సు కింద రూ.50వేలు అందటంతో ఆ ఓనర్ భలే మంచి బేరం అనుకున్నాడు. షాపులో హోటల్ పెట్టుకుంటామని ఓనర్‌ను నమ్మించిన ఆ ముఠా షాపు రెన్నోవేషన్ చేస్తున్నట్లు బోర్డు కూడా పెట్టింది.
ఇంకా చుట్టూ జనాలు నమ్మేలా రూ.లక్ష పెట్టి ఫర్నిచర్ కూడా కొని తీసుకువచ్చారు. జనవరి 8న హోటల్ రీఓపెన్ చేస్తామని కనస్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా తెప్పించారు. సరే అద్దె తీసుకోవటమే కాదు షాపు మొత్తం బాగు చేసి పెడతామంటే నాకేం నష్టమని ఓనర్ అనుకున్నాడు. కానీ ఈ దొంగల ముఠా వేసే ప్లాన్ వాళ్లకి తెలియదు.
ఏం ప్లాన్ నాయనా
ఓ శనివారం రాత్రి పూట పని ప్రారంభించింది దొంగల ముఠా. ముందుగా బ్యాంకులో అలారం మోగకుండా ఎవరినో మ్యానేజ్ చేసి పని చేయించుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా లాకర్ కిందకు వచ్చేలా ప్లేస్ చూసుకుని గ్యాస్ కట్టర్, డ్రిల్లింగ్ వర్క్ చేశారు. నిజంగానే రెన్నోవేషన్ పనులు చేస్తున్నామని చెప్పటంతో చుట్టుపక్కల ఎవ్వరూ పట్టించుకోలేదు.
అలా అనుకున్నది సాధించిన ఆ నలుగురి ముఠా...లాకర్ రూం తెరిచి స్ట్రాంగ్ రూంలో ఉన్న 80 కిలోల బంగారం, రూ.50 లక్షల క్యాష్‌ను బ్యాగుల్లోకి సర్దేసింది. మొత్తం చోరీ చేసిన సొత్తు విలువ అక్షరాలా 8 కోట్ల రూపాయలు. ఆదివారం గడిచిపోయి సోమవారం బ్యాంకు సిబ్బంది వచ్చి తలుపులు తెరిచి చూస్తే కానీ అసలు విషయం బయటికి రాలేదు. వెంటనే అప్రమత్తమైన కేరళ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలను ఫాం చేశారు. అప్పటి మలప్పురం జిల్లా ఎస్పీ పీ విజయన్ ఆద్వర్యంలో పోలీసులు బృందాలు విచారణను ప్రారంభించాయి.
ఏం ట్విస్ట్!
ఒక్క క్లూ కూడా వదల్లేదు ఆ దొంగల ముఠా. అప్పటికే దొంగతనం జరిగి ఒక రోజు దాటిపోయింది. కనుక నేరస్థులు చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు. ఇక్కడి వరకు ఒక ఎత్తయితే ఆ తర్వాత ట్విస్ట్‌లు మామూలుగా లేవు. ఇక్కడి నుంచే ఆ దొంగలు ఎంత ప్రీ ప్లాన్డ్ వర్క్ చేశారో పోలీసులకు తెలియటం మొదలైంది. దొంగతనం చేసిన చోట ఉన్న ఒకే ఒక్క క్లూ 'జై మావో' అని నినాదాన్ని రాశారు. సో పోలీసులకున్న సోర్సులతో, కొరియర్లతో దొంగతనాలకు ఎవరైనా మావోల ముఠా ప్లాన్ చేసిందోమో ఎంక్వేరీ చేశారు. కానీ చాలా ఆలస్యంగా తెలిసిందేంటంటే వాళ్లు ఎవ్వరికీ మావోయిస్టులతో సంబంధం లేదు. క్రైమ్ ను డైవర్ట్ చేయటానికే అలా నినాదాలు రాశారు.
ఇది తేలేలోపు తేలిన మరో విషయం హైదరాబాద్‌లో ఓ హోటల్ గదిలో కిలో బంగారం దొరికిందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్విస్టేగేషన్ టీం లన్నీ హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చాయి. ఎక్కడో డౌట్ కావాలని ఇక్కడ బంగారం వదిలేలా చేశారా అని కూడా పోలీసులు అనుమానించారు. ఈ లోపు మలప్పురం పోలీసులకు రకరకాల ఫోన్ కాల్స్ వచ్చేవి. ఇక పోలీసులకు పిచ్చెక్కిపోయేది. దొంగలు అక్కడున్నారని, ఇక్కడుున్నారని ఏవేవో కథలు. అసలు ఫోన్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ట్రాప్ చేస్తే ఒకటి కోల్ కతా, ఒకటి ముంబయి, ఒకటి చెన్నై, ఇంకోటి దిల్లీ ఇలా సంబంధం లేకుండా ఫోన్ కాల్స్.
మలప్పురం పోలీసులకు ఏదో లింక్ దొరికింది. అసలు ఒకే ప్రాంతంలో ఉండి ఇన్నేసి ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు. నెట్ వర్క్ సాయంతో బంగారాన్ని హైదరాబాద్ లో దొరికేలా చేశారు. ఇంత జరుగుతున్నాయంటే వీళ్లేదో ఫోన్ కాల్స్ ఫెసిలిటీ య్యూజ్ చేస్తున్నారనే డౌట్ వచ్చింది. దొంగతనం జరిగిన రోజు రాత్రి ఆ లొకేషన్ పరిసర ప్రాంతాలకు వచ్చిన ఫోన్ కాల్స్ ను తవ్వటం మొదలుపెట్టారు. మొత్తం ఇరవై లక్షల ఫోన్ కాల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పని అయినా వెనుకడుగు వేయలేదు కేరళ పోలీసులు. ఐటీ సర్వీసెస్ ప్రొవెడర్స్, టెలికాం నెట్ వర్క్ అధికారుల సహాయంతో ఫోన్ కాల్స్ ను డీకోడ్ చేయటం మొదలు పెట్టారు. ఫైనల్ గా ఓ సీక్రెట్ ఫోన్ నెంబర్ ద్వారా మెయిన్ సస్పెక్ట్స్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యారని పోలీసులు గుర్తించటం ఈ కేసులో కీలక మలుపు.
ఎట్టకేలకు
సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోజికోడ్ లో ని ఓ ఇంటిని మ్యాప్ చేశారు పోలీసులు. రౌండప్ చేసి అక్కడే తలదాచుకుంటున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రధాన నిందితుడు జోసఫ్ అలియాస్ జైసన్ అలియాస్ బాబును కింగ్ పిన్‌గా గుర్తించారు. ఈ దొంగతనం మొత్తానికి అతనిదే మాస్టర్ మైండ్. మిగిలిన ముగ్గురుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దొంగిలించిన బంగారం, డబ్బులో 80 శాతం అక్కడిక్కడే రికవరీ చేశారు. 2008 ఫిబ్రవరి 28న అప్పటి కేరళ ఏడీజీ ప్రెస్ మీట్ ను ఇండియాలో ఈ బిగ్గెస్ట్ రాబరీ కేస్ ను ఎలా ట్రేస్ అవుట్ చేశారో వివరించారు.
విచారణలో ఇంత పెద్ద స్కెచ్ తో దొంగతనం ఎందుకు చేశారని అడిగితే కింగ్ పిన్ బాబు ఏం చెప్పాడో తెలుసా...హృతిక్ రోషన్ ధూమ్ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యాడంట. ఆ సినిమా లో కూడా బ్యాంకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హోల్ పెట్టి దొంగతనం చేస్తారు. సో సినిమాల ప్రభావం నేరస్థులకు ఇంత ధైర్యం, కొత్త ఐడియాలను కూడా ఇస్తాయన్నమాట.