Chandrayaan 3 Landing LIVE: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్‌ఫుల్ - చంద్రుడిపై కాలర్ ఎగరేసిన భారత్, లైవ్‌లో చూడండి
Chandrayaan 3 Landing LIVE Updates: యావత్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్- 3 ప్రయోగం క్షణ క్షణ అప్‌డేట్ కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.
LIVE
Background
Chandrayaan 3 Landing LIVE Updates: భారత కీర్తి పతాక సగర్వంగా ఎగిరే క్షణం అరుదైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. యావత్ ప్రపంచమే శభాష్ అనే తరుణం రానే వచ్చింది. సాంకేతికంగా ఎన్నో అడుగులు ముందున్న దేశాలకి కూడా సాధ్యం కాని చారిత్రాత్మకమైన మరెవరూ సాధించలేని అరుదైన ఫీట్ భారత్ అంతరిక్ష సంస్థ సొంత కానుంది. అంతరిక్ష రంగంలో హేమాహేమీలు ఉన్నప్పటి వారు చేరుకోలేని ప్రాంతంలో భారతీయ జెండా రెపరెపలాడబోతోంది.
యావత్ ప్రపంచం ఆగస్టు 23 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన 'చంద్రయాన్-3' ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన 'లూనా-25' ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.
ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో సోమవారం (ఆగస్టు 21) కీలక ప్రకటన చేసింది. 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తోన్నంది. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతం పలికిందన్నది ఆ ట్వీట్ సారాంశం.
స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్‌ను స్వాగతిస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. డేటాను ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నాయి. ల్యాండర్ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి.. అని ఇస్రో ట్వీట్ చేసింది.
రష్యా లూనా 25 ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపాలన్న ప్రయోగాలు ఎందుకు విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019లో చంద్రయాన్ 2, ప్రస్తుతం రష్యా లూనా 25 ఫెయిలయ్యాయి. సౌత్ పోల్ మీద ల్యాండర్ దింపాలనుకున్న ప్రతీసారి ఎందుకు సైంటిస్టుల్లో వణుకు మొదలవుతుంది. వాస్తవానికి అమెరికా నాసాకు, సోవియట్ యూనియన్ కు, చైనా కు చంద్రుడి ల్యాండర్ ను దింపిన అనుభవం ఉంది. కానీ ఈ మూడు కూడా ల్యాండర్ ను దింపింది నార్త్ పోల్ దగ్గరే. చంద్రుడి సౌత్ పోల్ (South Pole of Moon) దగ్గర ల్యాండర్ ను దింపాలన్న ఆలోచన కూడా చేయలేదు మిగిలిన దేశాలు.
జాబిల్లి దక్షిణ ధృవంపై ఎలాగైనా సరే మిషన్ ను ల్యాండ్ చేయాలన్న టాస్క్ ను భారత్ ముందుగా తలకెత్తుకుంది. చంద్రయాన్ 1 తో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రయాన్ 2 మాడ్యూల్ లో పంపి సౌత్ పోల్ మీద దింపాలనుకున్నా అది సాధ్యం కాలేదు. చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ కావటంతో అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రధాని మోదీని పట్టుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు.
ఇప్పుడు రష్యా కూడా ఎంతో అనుభవం ఉన్నా చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను దింపలేకపోయింది. అంతరిక్ష ప్రయోగాలన్నీ ఎప్పుడూ కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ మోడ్ లోనే జరుగుతాయి. కానీ చంద్రుడి సౌత్ పోల్ సంగతి వేరు.చంద్రుడు ఒకే నిర్దిక్ష కక్ష్యలో భూమి చుట్టూ గిరగిరా తిరుగుతుండటంతో చంద్రుడి సౌత్ పోల్ మిస్టీరియస్ గా మారింది. చంద్రుడి మీద ఉత్తర ధృవం దగ్గర పగలు సమయంలో ఉష్ణోగ్రత 54 డిగ్రీలవరకూ ఉంటే... దక్షిణ ధృవంలో రాత్రి సమయాల్లో అది -203 డిగ్రీలవరకూ ఉంటూ కఠిన పరిస్థితులను తలపిస్తూ ఉంటుంది.
చంద్రుడి ఫొటోలు షేర్ చేసిన ల్యాండర్ విక్రమ్
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ ముగిసింది. భారత శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. అయితే జాబిల్లిపై ప్రస్తుతం సెకనుకు సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ విక్రమ్ కదులుతోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ పని మొదలుపెట్టేసింది. అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బెంగళూరు కేంద్రానికి, చంద్రయాన్ 3 ల్యాండర్ కు కనెక్షన్ కుదిరింది. హారిజాంటర్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలు ఇవి అని ఇస్రో పేర్కొంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
Chandrayaan 3 Message: ల్యాండ్ అయ్యాక చంద్రయాన్-3 మెసేజ్ ఇదే
చంద్రయానన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. రష్యాకు కూడా సాధ్యం కానీ ఫీట్ ను భారత్ సాధించింది. ఎంతో ఉత్కంఠకు దారితీసి చివరికి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. పూర్తి కథనం చదవండి
Chandrayaan 3 Records: రికార్డులు బద్దలుకొట్టిన చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్
ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. దాదాపు 7 వారాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ వీక్షిస్తూ సంబరపడ్డారు. చంద్రయాన్ 2 నేర్పిన పాఠాలతో భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3లో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. పూర్తి కథనం చదవండి
PM Modi on Chandrayaan: చంద్రయాన్ విజయంతో జీవితం ధన్యం - ప్రధాని మోదీ
చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని కొనియాడారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. పూర్తి కథనం చదవండి
Balakrishna on Chandrayaan 3: చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలు - బాలక్రిష్ణ
చంద్రుని దక్షిణ ధృవంపై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేసారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుంది. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. 140 కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.