అన్వేషించండి

Chandrayaan-3: ఈ నెల 23న చంద్రుడిపైకి చంద్రయాన్-అక్కడ ఏం చేస్తుందో తెలుసా?

Chandrayaan-3: చంద్రయాన్ ప్రయోగంతో భారత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికి ఐదు సార్లు కక్ష్య పెంపు పూర్తి చేసుకుని చంద్రుడి వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది.

Chandrayaan-3: చంద్రయాన్ ప్రయోగంతో భారత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికి ఐదు సార్లు కక్ష్య పెంపు పూర్తి చేసుకుని చంద్రుడి వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. శనివారం చంద్రయాన్‌ను ఇస్రో చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెడితే విజయం సాధించినట్లే. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ చంద్రుని ఉపరితలంపై సురక్షితం, మృదువైన ల్యాండింగ్‌ చేసి చంద్రునిపై రోవర్‌ను దించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దిగిన తరువాత చంద్రయాన్ ఏం చేస్తుందో తెలుసా? తెలియక పోతే చదివేసేయండి.

ల్యాండర్‌ నుంచి రోవర్‌ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్‌ సెకనుకు సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఈ సమయంలో అది తన పేలోడ్‌లు RAMBHA మరియు ILSAలను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహిస్తుందిఆ 14 రోజుల వ్యవధిలో రోవర్‌ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. 

చంద్రునిపై వాతావరణం, ఖనిజ సంపద, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సమాచారం ఇస్తుంది.  రోవర్‌లో లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) కూడా అమర్చబడి ఉంటాయి. ఇది చంద్ర ఉపరితలం, రాళ్లు, నేల రసాయన కూర్పును విశ్లేషిస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.

చంద్రయాన్‌–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. చంద్రయాన్‌–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించింది. అయితే చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్‌ అందకుండా పోయాయి. దాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్‌–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు.

చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, 2023న సాయంత్రం 5.47 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో శాష్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి కీలకం కాబోతుందని, భవిష్యత్తులో గ్రహాంతర కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

శాస్త్రవేత్తల్లో టెన్షన్‌
చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని ప్రభావ పరిధిలోకి ప్రవేశిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన దశ 5వ తేదీన జరుగనుంది. ఈ మిషన్‌లో అతి క్లిష్టమైన దశ చంద్రయాన్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి కచ్చితమైన ప్రణాళికతో చేస్తేనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సాధ్యమవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ చంద్రయాన్-3ని అందుకోవడంలో విఫలమైతే విపరీతమైన పరిణామాలు ఉంటాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా అంతరిక్ష నౌక చంద్రునిపై కూలిపోవచ్చు లేదా దాని నుంచి దూరంగా ఎగిరిపోయే అవకాశం ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget