అన్వేషించండి

Bharat Rice: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ - 'భారత్ రైస్' పేరిట రూ.29కే కేజీ బియ్యం, అప్పటి నుంచే విక్రయాలు

Central Government Rice: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారం నుంచి 'భారత్ రైస్' పేరిట రూ.25కే కిలో బియ్యం విక్రయించనున్నట్లు ప్రకటించింది.

Central Government Bharat Rice: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు సాగించేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి 'భారత్ రైస్' (Bharat Rice) పేరిట కేజీ బియ్యం రూ.29లకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో వివరాలు ప్రకటించాలని ట్రేడర్లను ఆదేశించింది. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. గతేడాది కాలంగా బియ్యం ధరలు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా (Snajeev Chopra) తెలిపారు. ఈ ధరకు రాయితీ ధరకు బియ్యం విక్రయించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 'భారత్ రైస్'ను నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్స్ లోనూ ఈ రైస్ విక్రయించనున్నట్లు వెల్లడించారు.

5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో

ఈ 'భారత్ రైస్'ను వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ ల రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాగా, ఇప్పటికే 'భారత్ అటా' (Bharat Aata) పేరుతో గోధుమ పిండిని కిలో రూ.27.50 పైసలకు.. 'భారత్ దాల్' (Bharat Dall) పేరిట శనగపప్పును కిలో రూ.60కు కేంద్రం విక్రయిస్తోంది. అయితే, బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేయబోమని.. దేశీయంగా బియ్యం ధరలు తగ్గే వరకూ నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ తమ పోర్టల్స్ లో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయో రిటైలర్లు, హోల్ సేలర్లు, ప్రాసెసర్లు ప్రతీ శుక్రవారం తెలియజేయాలని ఆదేశించింది. బియ్యం మినహా ఇతర ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Also Read: Actor Vijay Political Entry: విజయ్ ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టిన్టటు? - తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలెలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
Ys Jagan : ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్‌ కేసు పెట్టిన ప్రియురాలు
Ys Jagan : ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
Robot Suicide: పని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న రోబో, ఈ ఉద్యోగాలపై మర మనుషులకూ విసుగొచ్చేస్తోందా!
పని ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న రోబో, ఈ ఉద్యోగాలపై మర మనుషులకూ విసుగొచ్చేస్తోందా!
UK Election Results 2024: రాజకీయాల్లో స్టార్మర్ స్టైలే వేరు, ప్రధానిగానూ అదే మార్క్‌ చూపిస్తారా?
రాజకీయాల్లో స్టార్మర్ స్టైలే వేరు, ప్రధానిగానూ అదే మార్క్‌ చూపిస్తారా?
Dhoomam Telugu OTT: ధూమం తెలుగు డిజిటల్ ప్రీమియర్ - థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సినిమా
ధూమం తెలుగు డిజిటల్ ప్రీమియర్ - థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ సినిమా
Embed widget