అన్వేషించండి

PM Vidya Laxmi: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ - పీఎం విద్యాలక్ష్మి పథకానికి గ్రీన్ సిగ్నల్

Union Cabinet: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం విద్యా లక్ష్మి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Union Cabinet Approves PM Vidya Laxmi Scheme: ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వారి కలలను సాకారం చేసుకోలేకపోతోన్న మధ్య తరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం - విద్యాలక్ష్మి (PM Vidya Laxmi) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. ఈ పథకం కింద ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు రుణాలు పొందొచ్చు. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం వరకూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. అలాగే, ఎఫ్‌సీఐలో మూలధన అవసరాలకు రూ.10,700 కోట్లు కేటాయించేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.

22 లక్షల మందికి లబ్ధి

పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇది సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తింపచేయాలని అన్నారు. రూ.10 లక్షల వరకూ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నారు. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వైష్ణవ్ తెలిపారు.

మరోవైపు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఉన్న అవకాశాన్ని కేంద్రం మరో ఏడాది పెంచింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటివరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉంది. అయితే ఇకపై 3 సంవత్సరాలు పరీక్ష రాసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. 

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వెనుక ఉష- తమిళ అమ్మాయిని ఓడించిన తెలుగమ్మాయి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Skoda Kylaq: రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Usha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయిDonald Trump Won US Elections 2024 | అధికారం కోసం అణువణువూ శ్రమించిన ట్రంప్ | ABP DesamDonald Trump Going to be Win US Elections 2024 | అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువలో ట్రంప్ | ABPవీడియో: మా ఇంటికి దేవుడు వచ్చి టీ చేసిచ్చాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Skoda Kylaq: రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
రూ.8 లక్షల్లోపు ధరలోనే అదిరే ఎస్‌యూవీ - స్కోడా కైలాక్‌ వచ్చేసింది!
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Embed widget