Covovax: 12-17 ఏళ్ల పిల్లల్లో కోవోవాక్స్ అత్యవసర వినియోగం, డీజీసీఐకి సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ
12-17 ఏళ్ల పిల్లల్లో కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ డీజీసీఐకి సూచించింది. కోవోవాక్స్ ను పెద్దవారిలో అత్యవసర వినియోగానికి ఉపయోగిస్తున్నారు.
![Covovax: 12-17 ఏళ్ల పిల్లల్లో కోవోవాక్స్ అత్యవసర వినియోగం, డీజీసీఐకి సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ CDSCO Govt Panel Recommends Granting Emergency Approval To Covovax For 12-17 Age Group Covovax: 12-17 ఏళ్ల పిల్లల్లో కోవోవాక్స్ అత్యవసర వినియోగం, డీజీసీఐకి సిఫార్సు చేసిన నిపుణుల కమిటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/04/2eb0bd56bc0850ae469d503503acafcc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covovax: దేశంలో అభివృద్ధి చేసిన కోవోవాక్స్ వ్యాక్సిన్ 12-17 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగానికి(EUA) అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సెంట్రల్ డ్రగ్ అథారిటీ(DGCI)కి శుక్రవారం సిఫార్సు చేసింది. 12 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారిలో కోవోవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)లో గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, ఫిబ్రవరి 21న DGCIకి దరఖాస్తు సమర్పించారు.
డీజీసీఐ ఆమోదానికి సిఫార్సు
ఈ వయసులో ఉన్న 2,700 మంది పిల్లలపై నిర్వహించిన రెండు అధ్యయనాల ప్రకారం, కోవోవాక్స్(Covovax) అత్యంత ప్రభావవంతమైనది, రోగనిరోధక శక్తి, సురక్షితమైనదని ప్రకాశ్ కుమార్ సింగ్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ శుక్రవారం కోవోవాక్స్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును డీజీసీఐకి పంపారని వార్తా సంస్థ PTIకి పేర్కొంది.
కోవిడ్ పై పోరులో కోవోవాక్స్ కీలకం
"ఈ సిఫార్సు ఆమోదం మన దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రపంచం మొత్తానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. ప్రధాని మంత్రి 'మేకింగ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్' అనే ఉద్దేశాన్ని ఇది నెరవేరుస్తుంది. మా సీఈవో అదార్ సి పూనావాలా నిర్ణయాలకు అనుగుణంగా కోవిడ్ -19 నుంచి భారత్, ప్రపంచంలోని పిల్లలను రక్షించడంలో కోవోవాక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది”అని సింగ్ దరఖాస్తులో పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది.
Also Read: Corona Updates: ఏపీలో కనిష్టానికి కరోనా కేసులు, కొత్తగా 86 మందికి పాజిటివ్
పెద్దవారిలో అత్యవసర వినియోగానికి అనుమతి
కోవోవాక్స్ ను పెద్దవారిలో అత్యవసర వినియోగానికి డీజీసీఐ గత ఏడాది డిసెంబర్ 28న అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్ ను కేంద్రం టీకా డ్రైవ్‌లో చేర్చలేదు. కోవోవ్యాక్స్ ను నోవావాక్స్ నుంచి సాంకేతికత బదిలీ ద్వారా తయారుచేశారు. మార్కెటింగ్ కోసం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. దీనికి డిసెంబర్ 17, 2020న WHO అత్యవసర వినియోగ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం భారతదేశం 15-18 సంవత్సరాల మధ్య వయస్కులకు టీకాలు వేయడానికి భారత్ బయోటెక్-తయారీ చేసిన కోవాక్సిన్‌ను ఉపయోగిస్తోంది.
Also Read: Screen Time: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)