Karti Chidambaram: వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ అరెస్ట్
Karti Chidambaram: వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడ్ని సీబీఐ అరెస్ట్ చేసింది.
Karti Chidambaram:
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆడిటర్, సన్నిహితుడు భాస్కర్ రామన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం అరెస్ట్ చేసింది. వీసా కుంభకోణం కేసులో సమగ్ర విచారణ అనంతరం భాస్కర్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాల్లో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది.
CBI has arrested S Bhaskar Raman, a close associate of Congress leader Karti P Chidambaram in an ongoing visa corruption case following questioning late last night: CBI sources
— ANI (@ANI) May 18, 2022
కార్తీపై కేసు
వీసా కుంభకోణంలో కార్తీ పి చిదంబరం, ఎస్ భాస్కరరామన్, వికాస్ మఖారియా, మాన్సా (పంజాబ్) ఆధారిత ప్రైవేట్ కంపెనీ, ఎంఎస్ తల్వాండి సబో పవర్ లిమిటెడ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
మాన్సా వద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీ థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్థాపించే ప్రక్రియలో ఉందని, ప్లాంట్ స్థాపనను చైనా కంపెనీకి అవుట్‌సోర్స్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. చైనీస్ కంపెనీ అధికారులకు కేటాయించిన 263 ప్రాజెక్ట్ వీసాలను తిరిగి ఉపయోగించడానికి అనుమతిని మంజూరు చేయడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు పెట్టింది.
చెన్నై, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, దిల్లీ ఇతర ప్రాంతాలతో సహా దాదాపు 10 చోట్ల సోదాలు జరిపిన సీబీఐ బుధవారం భాస్కర్ రామన్‌ను అరెస్టు చేసింది.
Also Read: Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్