అన్వేషించండి

BRS Party New Song: దేశ్ కేలియే ఆ రహా హై కేసీఆర్ - సీఎం కోసం సరికొత్త పాట

BRS Party New Song: దేశ్ కేలియే ఆ రహ హై కేసీఆర్ అంటూ సరికొత్త పాటను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ రూపొందించారు. ఢిల్లీ ఆఫీసులో ఈ పాటను కే కేశవరావు ఆవిష్కరించారు. 

BRS Party New Song: దేశ్ కేలియే ఆ రహా హై కేసీఆర్ (దేశం కోసం వస్తున్నారు కేసీఆర్) పాటను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ అద్భుతంగా రూపకల్పన చేయించారు. ఈ పాటను రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఢిల్లీ భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా జాతీయ ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇవ్వడంతో అరవింద్ ఈ పాటను హిందీలో ప్రత్యేకంగా రూపకల్పన చేయించారు. నిమిషమున్నర  నిడివిలో రూపొందించిన ఈ పాటలో కేసీఆర్ దేశానికి ఎంత అవసరమో తెలియజేస్తూ సాగుతుంది. అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో నిలిపిన మహా నాయకుడు కేసీఆర్ అని.. అదే లక్ష్యంతో దేశాన్ని కూడా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కలలు కంటున్న దేశ నాయకుడికి తన చిరుకానుక అని అరవింద్ అన్నారు. అసమాన ప్రతిభతో దేశాన్ని సైతం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లగల సత్తా కలిగిన మహా నేత వెంటే దేశమంతా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ సాంప్రదాయ బద్ధంగా కార్యక్రమం జరుగుతోంది. దివ్య ముహూర్తం అనే నమ్మకంతో నేడు (డిసెంబరు 14) 12.37 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించాలని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం వేద పండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణితో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఎస్పీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, గుర్నాం సింగ్ తదితర జాతీయ రైతు నంఘం నేతలు, మంత్రులు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర..

మరోవైపు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ గురించి పలు వ్యాఖ్యలు చేసారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని కవిత తెలిపారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేసి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా వ్యూహాలను రచిస్తామన్నారు.

ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఆర్ - ఎందుకంటే?

ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ఓ సమావేశం ముందే నిర్ణయం అయింది. మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధుల టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు. జపాన్ కు చెందిన సుజుకి కంపెనీతో గత కొంతకాలంగా విస్తృతంగా పెట్టుబడుల సంప్రదింపులు నడుస్తున్నాయి. సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి, మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget