Bihar BJP JDU Alliance End: బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా- BJPతో దోస్తీకి జేడీయూ గుడ్‌బై
Bihar BJP JDU Alliance End: బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు
Bihar BJP JDU Alliance End: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజనామా సమర్పించారు. గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామా లేఖ అందించారు. భాజపాతో దోస్తీకి గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన నిర్ణయమని నితీశ్ భావించినట్లు జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి.
#WATCH | Nitish Kumar confirms that he has resigned as Bihar CM pic.twitter.com/Av04rUXojx
— ANI (@ANI) August 9, 2022
మీ వెంటే
#BiharPoliticalCrisis | In the JD(U) meeting today, all MLAs and MPs of the party supported CM Nitish Kumar's decision and said that they are with him. They said that they will always be with him, whatever he may decide: Sources
— ANI (@ANI) August 9, 2022
(File photo) pic.twitter.com/pmCqkZaJWj
జేడీయూ శాసనసభ్యులు, ముఖ్య నేతలతో నితీశ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్.. భాజపాతో దోస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారట. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము నితీశ్ కుమార్ వెంటే ఉంటామని.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్‌జేడీ
మహాఘట్‌బంధన్ సమావేశంలో కూడా తేజస్వీ యాదవ్ నాయకత్వాన్ని ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బలపరిచినట్లు సమాచారం. తేజస్వీ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఆయన వెంటే ఉంటామని వారు ప్రకటించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని, అయితే తేజస్వీ యాదవ్ మొత్తం చూసుకుంటున్నట్లు ఆర్‌జేడీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ఓకే
మహాఘట్‌బంధన్‌లో నితీశ్ కుమార్ భాగమైతే బిహార్‌కు ఆయనే సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
" నితీశ్ కుమార్ వస్తే మేం స్వాగతిస్తాం. మా పూర్తి మద్దతు ఇస్తాం. మహాఘట్‌బంధన్ సమావేశం జరుగుతోంది. ఒకవేళ నితీశ్ కుమార్ వస్తే మేం ఆయనే బిహార్ సీఎంగా కొనసాగేలా మా మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇది సమావేశం పూర్తయిన తర్వాతే ప్రకటిస్తాం. "
-అజిత్ శర్మ, కాంగ్రెస్ పక్ష నేత
నితీశ్ దూరం
చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురవుతున్నారు. దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Also Read: Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!