Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్రప కేబినెట్ విస్తరణలో 9 మంది భాజపా, 9 మంది శివసేన నేతలకు అవకాశం దక్కింది.
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్రలో ఎట్టకేలకు కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ విస్తరణలో మొత్తం 18 మందికి చోటు దొరికింది. 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు.
Shiv Sena MLAs Gulabrao Patil and Dadaji Dagadu Bhuse take oath as Maharashtra ministers at Raj Bhavan in Mumbai pic.twitter.com/jkpezoOE1d
— ANI (@ANI) August 9, 2022
ఆలస్యంగా
ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ బీఎస్ కోశ్యారీ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణస్వీకారం జరిగింది.
భాజపా నుంచి
- చంద్రకాంత్ పాటిల్
- సుధీర్ ముంగటివార్
- గిరిష్ మహాజన్
- మంగల్ ప్రభాత్ లోధా
- విజయ్ కుమార్ గవిత్
- అతుల్ సావె
- సురేశ్ ఖాడె
- రాధాకృష్ణ వీఖే పాటిల్
- రవీంద్ర చవాన్
శివసేన వర్గం నుంచి దాదా భూసే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, దీపక్ కేసార్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
చాన్నాళ్ల తర్వాత
రాష్ట్రంలో భాజపా- శిందే వర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ ఏక్‌నాథ్ శిందే, ఫడణవీస్ లక్ష్యంగా పలు విమర్శలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేశారు.
శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం.. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో కూలిపోయింది. ఆ తర్వాత ఏక్‌నాథ్ శిందే వర్గం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరి అంచనాలకు అతీతంగా భాజపా.. ఏక్‌నాథ్ శిందేకు సీఎం పీఠం అప్పగించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇది జరిగిన ఇన్నాళ్లకు కేబినెట్ విస్తరణ చేపట్టారు శిందే- భాజపా వర్గం.
Also Read: Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!
Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు