అన్వేషించండి

Hathras stampede: బాగా బాధపడ్డారట- భరించే శక్తి దేవుడు ప్రసాదిస్తాడట- హథ్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన బోలే బాబా

Hathras Stampede Accident: సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ బోలే బాబా హత్రాస్ 'సత్సంగ్' తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనతో తాను చాలా కుంగిపోయానని అన్నారు.

‘Bhole Baba’ Reacts To Hathras ‘satsang’ Stampede: ఉత్తరప్రదేశ్‌(UP) హథ్రాస్(Hathras) జిల్లాలో సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బోలే బాబా(Bhole Baba).. ఈ దుర్ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనుకు కేంద్ర బిందువుగా ఉన్నా నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ బోలే బాబా... ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు.  

121 మంది మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న బోలేబాబా... ఈ బాధను భరించే శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడని అన్నారు. ప్రభుత్వంపై, పరిపాలనపై నమ్మకం ఉంచాలని తన భక్తులకు, ప్రజలకు బోలే బాబా హితబోధ చేశారు. ఈ తొక్కిసలాట వెనక ఉన్నవారిని ఎవరినీ విడిచి పెట్టవద్దని... వారందరికీ శిక్ష పడుతుందన్న నమ్మకం తనకుందని బోలే బాబా.. ఓ వీడియోను విడుదల చేశారు.
 
మరణించిన వారి కుటుంబాలకు.. క్షతగాత్ర కుటుంబాలకు అండగా ఉంటానని... వారికి జీవితాంతం సాయం చేస్తూనే ఉంటానని భోలే బాబా ఆ వీడియో ప్రకటనలో తెలిపారు. " జూలై 2న జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటనతో నేను చాలా బాధపడ్డాను. దేవుడు మాకు ఈ బాధను భరించే శక్తిని ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పాలనపై విశ్వాసం ఉంచండి" అని ఆ వీడియోలో బోలే బాబా తెలిపారు. 
 
బోలేబాబా నిర్వహించిన సత్సంగం కార్యక్రమంలో  2.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భోలే బాబా పాద ధూళిని సేకరించేందుకు భక్తులు ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగింది. ప్రజలు ఒకరిపై ఒకరు పడడంతో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 80,000 మందికే అనుమతి ఇచ్చిన అంతకుమించి ప్రజలు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే నిర్వహకుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమని విచారణలో అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. 
 
విచారణకు సహకరిస్తాం
భోలే బాబా తొక్కిసలాట జరిగినప్పటి నుంచి అదృశ్యమయ్యారు. అయితే బోలేబాబా విచారణకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు.  తమ వద్ద బాధితుల జాబితా ఉందని... తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, వివాహ ఖర్చులను.. బోలే బాబాను చూసుకుంటారని...  నారాయణ్ సకర్ హరి ట్రస్ట్ ఆ బాధ్యతలు తీసుకుంటుందని ఏపీ సింగ్‌ వెల్లడించారు.
 
ఈ సత్సంగ్‌ కార్యక్రమంలో ప్రధాన నిందితుడు, ప్రధాన సేవదారు దేవప్రకాష్ మధుకర్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హత్రాస్ పోలీసులు తెలిపారు. మధుకర్ అరెస్ట్‌తో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే మధుకర్‌కు పోలీసులు అరెస్ట్‌ చేయలేదని... ఆయనే లొంగిపోయారని... బోలే బాబా తరపు లాయర్‌ తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని... కాబట్టి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని ఏపీ సింగ్‌ వెల్లడించారు. 
 
తొక్కిసలాటకు సంబంధించి మధుకర్‌పై హత్రాస్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతని సమాచారం ఇచ్చినవారికి లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మధుకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆర్గనైజింగ్ కమిటీలో భాగమైన ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా మరో ఆరుగురిని కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. తొక్కిసలాటపై సిట్ నివేదిక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చేరింది.  భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ఇప్పటివరకు 90 మంది వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది .

టాప్ హెడ్ లైన్స్

2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
Rahul Gandhi: దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
PM Kisan Yojana Rules: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే రూ. 6,000 ఎవరికి వస్తాయి?
పీఎం కిసాన్ రూల్స్.. ఒకే ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే రూ. 6,000 ఎవరికి వస్తాయి?
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Embed widget