బెంగళూరు వైద్యులు అద్బుతం, తలపై ఉన్న గోళీల సంచిన తొలగించిన వైద్యులు!
బెంగళూరు వైద్యులు అద్బుతం చేశారు. ఓ మహిళ 52 సంవత్సరాల నుంచి తన తల పై మోస్తున్న భారాన్ని తొలగించారు.శ్రీ సత్య సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు.
Doctors Remove Sack Of Marbles: బెంగళూరు వైద్యులు అద్బుతం చేశారు. ఓ మహిళ 52 సంవత్సరాల నుంచి తన తలపై మోస్తున్న భారాన్ని తొలగించారు. శ్రీ సత్య సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ శస్త్ర చికిత్స ను నిర్వహించారు. సుమారు 52 సంవత్సరాల భారాన్ని వారు తొలగించారు. ఓ మహిళ చిన్నతనం నుంచి కూడా తన తల వెనుక భాగంలో గోళీల సంచిలాగా ఉబ్బుతూ ఉన్న తిత్తి ఒకటి ఉంది. అది ఆమెతో పాటే పెరుగుతూ వస్తుంది. అది చూడాటానికి గోళీలా సంచిలా ఉంటుంది. అది ఆమెకు తలపైన కొమ్ములా పొడుచుకుని ఉంటుంది.
అలా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నొప్పి ఉండదని వైద్యులు వివరించారు. ఇది తల వెనుక భాగంలో బాగా కండ పట్టి చూడటానికి ఒక హెయిర్ బన్ లా ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ తిత్తిని తొలగించిన తరువాత ఆ తిత్తి ద్రవం, వెంట్రుకలు, కొవ్వు అణువులతో వివిధ పరిమాణాల కెరాటిన్ బంతులతో నిండి ఉందని వైద్యులు గమనించారు. మహిళ తలలో పెరిగిన బంతులను డెర్మాయిడ్ సిస్ట్ లుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా తల, మెడ వంటి భాగాలలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.
కొన్నిసార్లు ఇవి రోగి యొక్క అండాశయాలలో కానీ, శరీరంలోని ఇతర భాగాల్లో కూడా పెరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు, నొప్పి కూడా లేకుండా ఉంటాయి. కానీ ఇవి కొన్ని సందర్భాల్లో ఎముకలకు నష్టం కలిగించేవిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిని తొలగించినప్పటికీ కూడా మళ్లీ తిరిగి పెరిగే అవకాశముంది. కానీ ఈ బెంగళూరు మహిళకు మాత్రం అవి తిరిగి రాలేదని వైద్యులు స్పష్టం చేశారు.