Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
Bengal Cabinet: బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
Bengal Cabinet: బంగాల్ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న వేళ బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మేరకు బంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రకటించారు.
Bengal cabinet gives nod to introduce bill to make CM as chancellor of state-run varsities: Edu min
— Press Trust of India (@PTI_News) May 26, 2022
తమిళనాడు
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేసింది.
Also Read: Rajya Sabha Polls 2022: భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం!
Also Read: Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!