Himanta Biswa Sarma: పవార్ జీ, మీ కూతురిని పాలస్తీనా పంపండి - శరత్ పవార్‌కు హిమంత బిశ్వా శర్మ కౌంటర్
Himanta Biswa Sarma: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు.
Himanta Biswa Sarma: ఇజ్రాయెల్(Israeli)-పాలస్తీనా(Palestine) వివాదంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) చేసిన వ్యాఖ్యలపై అసోం(Assam ) ముఖ్యమంత్రి( Chief Minister ) హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శరత్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే(Supriya)ను గాజాకు పంపాలని సూచించారు. హమాస్(Hamas ) తరఫున పోరాడటానికి సుప్రియను శరద్ పవార్ గాజా(Gaza)కు పంపుతారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ(Modi) ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపి, హమాస్ ఉగ్రవాద దాడులను ఖండించిన కొద్ది రోజుల తర్వాత శరద్ పవార్ ప్రకటన వెలువడింది. దీనికి కౌంటర్‌గా అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు.
శరద్ పవార్ ఏమన్నారంటే?
పాలస్తీనా, ఇజ్రాయెల్ వివాదంపై ఎన్‌సీపీ అధినేత శరత్ పవార్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొన్నారు. గతంలో చాలా మంది భారత ప్రధానులు పాలస్తీనా వైపు నిలబడ్డారని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru), ఇందిరా గాంధీ(Indira Gandhi), రాజీవ్ గాంధీ(Rajiv Gandhi), అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee), పాలస్తీనాకు సహాయం చేశారని గుర్తు చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనాను కాదని ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని, అసలు సమస్యను మోదీ విస్మరించారని శరత్ పవార్ అభిప్రాయపడ్డారు. భూమి మొత్తం పాలస్తీనాది అని, ఇజ్రాయెల్ వారి భూమిని ఆక్రమించుకుందని ఆయన అన్నారు. ఆ స్థలం, భూమి, ఇళ్ళు, ఇలా ప్రతిదీ పాలస్తీనాకు చెందినదేనని, ఇజ్రాయెల్ వాటిని స్వాధీనం చేసుకుందని చెప్పారు. అలాగే అసలైన ఇజ్రాయెల్ ప్రజలకు ఎన్‌సీపీ అండగా నిలుస్తందని శరత్ పవార్ పేర్కొన్నారు.
పీయూష్ గోయల్ కౌంటర్
పవార్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడిపై భారతదేశం వైఖరిపై ఇలాంటి అసంబద్ధమైన ప్రకటనలు చేయడం చాలా కలవరపెడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద ముప్పుని అన్ని రకాలుగా ఖండించాలన్నారు. ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసిన వ్యక్తి.. తీవ్రవాదానికి సంబంధించిన విషయాల్లో ఇలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. గతంలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రభుత్వంలో శరద్ పవార్ కూడా ఒక భాగమేనని, భారత గడ్డపై దాడి జరిగినప్పుడు వాళ్లు నిద్రపోతున్నారని మండిపడ్డారు. ఈ కుళ్లిన మనస్తత్వానికి శరత్ పవార్ స్వస్తి పలకాలని, ఇప్పుడైనా దేశం గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బదులిచ్చారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ 5వేల రాకెట్లతో మెరుపుదాడి చేసింది. ఇందులో ఇజ్రాయెల్ ప్రజలు పెద్ద ఎత్తున మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఈ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఉగ్రదాడులుగా అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని అన్నారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతోనూ ఫోన్‌లో మాట్లాడారు. తాము అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని చెప్పి, ఆయనకు భరోసా కల్పించారు.