Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Maharashtra New CM Name: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై క్లారిటీ వచ్చింది. రాత్రి ముగ్గురు నేతలతో అమిత్‌షా సమావేశమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Maharashtra CM News: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సంబంధించి నిన్న రాత్రి (నవంబర్ 28) ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరిగింది. మహారాష్ట్ర రాజకీయాలపై అమిత్ షా, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఇతర నేతలు చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి పదవి, మంత్రి వర్గ కేటాయింపులపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినప్పటికీ అధికారికంగా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
నేడు ముంబైలో మహాకూటమి సమావేశం జరగనుంది. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ఈ సమావేశానికి హాజరవుతారు. అమిత్ షా ఇచ్చిన సలహాలు, నిర్ణయాలపై చర్చిస్తారు. మరో రెండు రోజుల్లో మహారాష్ట్రకు పరిశీలకులు వస్తారని తెలుస్తోంది. కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది.
సమావేశంలో ఏం జరిగింది?
నిన్న ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చించారు. అమిత్ షా నివాసంలో రాత్రి సుమారు రెండు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సీఎంగా ఫడ్నవీస్ దాదాపు ఖరారు అయినప్పటికీ ఢిల్లీ నుంచి పరిశీలకులు రెండు రోజుల్లో మహారాష్ట్ర వస్తారని అప్పుడే ప్రకటిస్తారని తెలియజేసినట్టు సమాచారం. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సమావేశంలో ఏక్‌నాథ్ షిండే ఏం చెప్పారు?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన డిమాండ్లను ఉంచారు. స్పీకర్ పదవితో పాటు 12 మంత్రి పదవులు ఇవ్వాలని సూచించారు. హోం, పట్టణాభివృద్ధి సహా ముఖ్యమైన శాఖలను అడిగారు. హోంమంత్రి ఇచ్చినప్పటికీ తగిన గౌరవాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.
ముంబైలో మరోసారి భేటీ
మహాకూటమి సమావేశం నేడు ముంబైలో జరగనుంది. అమిత్ షా చెప్పిన సలహాలు, నిర్ణయాలపై దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే చర్చించనున్నట్లు సమాచారం. షాతో భేటీ సానుకూలంగానే ఉందని 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని ముగ్గురం కలిసి పని చేస్తామన్నారు.
21, 12, 10 ఫార్ములాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. బీజేపీకి గరిష్టంగా 20 నుంచి 25 మంత్రిపదవులు శివసేనకు 10 నుంచి 12, ఎన్సీపీకి 7-9 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక చర్చలు మాత్రమే అని ఇంకా పూర్తి స్థాయి చర్చలు ఇవాళ జరగనున్నట్టు సమాచారం.
ఈసారి మంత్రి వర్గంలో సీనియర్ నేతలకు పెద్దగా ఛాన్స్ లేకపోవచ్చని తెలుస్తోంది. యువ నాయకులను తీసుకోనున్నారట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కబోదని అంటున్నారు.
అమిత్‌షాతో సమావేశం అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషంగా ఉంటే ఏక్‌నాథ్ షిండే మాత్రం డీలాపడిపోయినట్టు చెబుతున్నారు. ఈ సమావేశానికి చెందిన ఫొటోలు చూస్తే అమిత్ షా దేవేంద్ర ఫడ్నవీస్‌కి పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లు ఉంది. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. అందుకు భిన్నంగా పక్కనే నిల్చున్న ఏకనాథ్ షిండే ముఖంలో ఎక్స్ ప్రెషన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఢిల్లీ మీటింగ్ తర్వాత ఏకనాథ్ షిండే బాడీ లాంగ్వేజ్ చర్చనీయాంశంగా మారింది.
Also Read: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?