Ambulance Accident Karnataka: షాకింగ్ వీడియో- ఒకర్ని కాపాడబోయి నలుగుర్ని చంపిన అంబులెన్స్ డ్రైవర్!
Ambulance Accident Karnataka: కర్ణాటక ఉడిపిలో ఓ అంబులెన్స్ టోల్ బూత్‌ను ఢీ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.
Ambulance Accident Karnataka: అత్యంత వేగంగా అంబులెన్స్‌ను టోల్‌బూత్‌ను ఢీ కొట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మృతి చెందారు.
Speeding Ambulance crashes into the toll gate at Shiroor in Udupi district of Karnataka.
— Mangalore City (@MangaloreCity) July 20, 2022
The ambulance was on its way to bring a patient from Honnavar to Kundapur, lost its control and collided with the toll booth. Three people have reportedly died in the accident. pic.twitter.com/hgVVjsG9EX
ఇదీ జరిగింది
ఉడిపీ జిల్లాలోని కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. భారీ వర్షంలో కూడా ఆ అంబులెన్స్ వేగంగా ప్రయాణిస్తోంది. అంబులెన్స్ రాకను గమనించిన టోల్ బూత్ సిబ్బంది ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించి ప్రత్యేక లైన్‌లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు.
🇮🇳🚑Four people died and four others sustained injuries after a speeding ambulance had hit a tollgate in Karnataka.
— Naren Mukherjee 🇮🇳 (@narendra52) July 21, 2022
🔍The driver failed to control the vehicle and hit the tollgate despite the staff's efforts to clean the road for the ambulance.
CCTV footage for toll plaza. 👇 pic.twitter.com/zAD42HCEff
అయితే అతి వేగంగా వస్తున్న అంబులెన్స్ తడిచి ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. చక్రాలు జారిపోవడంతో అంబులెన్స్ టోల్ బూత్ క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. వీరు ముగ్గురు మృతి చెందారు.
అలాగే అంబులెన్స్ ఢీ కొట్టడంతో టోల్ బూత్‌లో పని చేసే ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Corona Cases: రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసులు- కొత్తగా 21 వేల మందికి వైరస్
Also Read: Central Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన- మిషన్ మోడ్‌లో భర్తీ!