News
News
X

ఈ ఏడాది బడ్జెట్‌ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?

ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నుంచి 1948 వరకు దేశ తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

FOLLOW US: 
Share:

Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు(బుధవారం) అంటే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు, వచ్చే ఆదాయం లాంటి విషయాలను వివరిస్తుంది. వివిధ అభివృద్ధి పనులకు వివిధ మంత్రిత్వ శాఖలకు నిధులు కేటాయిస్తారు.

బడ్జెట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు

2019కి ముందు దేశ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సూట్‌కేసుల్లో  లెడ్జర్గా తీసుకువచ్చేవాళ్లు. నిర్మలా సీతారామన్ 2019లో ఈ సంప్రదాయాన్ని స్వస్తి చెప్పారు. ఎర్రటి గుడ్డలో ఫైలు చుట్టి ఆమె పార్లమెంటుకు బడ్జెట్‌ను తీసుకువస్తున్నారు. ఈ ఫైలును బుక్ కీపింగ్ అకౌంట్‌ అని పిలిచేవారు.
ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న స్వతంత్ర భారత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. చెట్టి 1947 నుంచి 1948 వరకు భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 73 సాధారణ బడ్జెట్లు, 14 మధ్యంతర బడ్జెట్లు, 4 ప్రత్యేక లేదా మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులు కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
2016కు ముందు ఫిబ్రవరి చివరి రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అరుణ్ జైట్లీ 2017లో దీన్ని బ్రేక్ చేశారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ జరుపుకునే పండుగ 'హల్వా వేడుక'. 'హల్వా'ను సంప్రదాయ 'కడాయి' లో తయారు చేసి, దేశం కోసం బడ్జెట్ తయారీ కసరత్తులో పాల్గొనే ఉద్యోగులందరికీ వడ్డిస్తారు.

నేటి నుంచి బడ్జేట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల రెండవ రోజున, ఫిబ్రవరి 1 న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం ప్రస్తుత టర్మ్ చివరి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి.

బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో కలిసి లోక్ సభ చాంబర్ నుంచి సెంట్రల్ హాల్ వరకు పరిశీలించి ఏర్పాట్లను మరింత సౌకర్యవంతంగా చేయాలని ఆదేశించారు.

మరి బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి

బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, పార్లమెంటు టీవీ, దూరదర్శన్ లో చూడవచ్చు. బడ్జెట్ లైవ్ టెలికాస్ట్ ను కూడా తమ యూట్యూబ్ ఛానెల్ లో చూడొచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన ఆన్లైన్ ప్లాట్ఫామ్‌లో బడ్జెట్ 2023 ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అన్ని న్యూస్‌ ఛానళ్లు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మీరు బడ్జెట్ 2023 ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి యూట్యూబ్‌లో కూడా చాలా ఛానళ్లు దీన్ని లైవ్‌ పెడతాయి. 

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్

మొత్తం 14 కేంద్ర బడ్జెట్లతోపాటు రాజ్యాంగం ద్వారా చెప్పిన గ్రాంట్లు, ఆర్థిక బిల్లుల డిమాండ్‌తో పాటు వార్షిక బడ్జెట్‌ను కూడా చూడవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం మీరు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లోకి వెళ్లి పార్లమెంటు సభ్యులతో పాటు సాధారణ ప్రజలు కూడా బడ్జెట్ పేపర్స్‌ను చూసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బడ్జెట్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇంగ్లిష్, హిందీ భాషల ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది. www.indiabudget.gov.in జనరల్ బడ్జెట్ వెబ్ పోర్టల్ లోకి వెళ్లి కూడా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Published at : 31 Jan 2023 07:54 AM (IST) Tags: Nirmala Sitharaman Union Budget Budget 2023 Union Budget 2023

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

టాప్ స్టోరీస్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్