Air India Express: సెలవు పెట్టిన 30 మంది ఉద్యోగులపై వేటు- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
Telugu News: మూకుమ్మడిగా సెలవు పెట్టిన సిబ్బందిపై వేటు వేసింది ఎయిర్ ఇండియా సంస్థ. ఇది కచ్చితంగా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసిన చర్యగా అభివర్ణించింది.
Air India Express : సిక్ లీవ్‌తో సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింటి టాటాగ్రూప్. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూకుమ్మడిగా సెలవులు పెట్టినందుకు 30 క్యాబిన్ క్రూ సిబ్బందిపై వేటు వేసింది.
టాటా గ్రూప్ యాజమాన్యం కింద ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 30 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. దీంతో వందకుపైగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. 15000 మంది ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారు.
ఈ చర్యను సీరియస్‌గా తీసుకున్న ఎయిర్ ఇండియా మూకుమ్మడిగా సెలవులు పెట్టిన వారికి మెయిల్స్ పంపించింది. అర్థరాత్రి పంపించిన మెయిల్స్‌లో ఇలా రాసి ఉంది..."ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనిని ఎగ్గొటడం సమర్థనీయమైన చర్య కాదు" అని ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు తెలిపింది.
ఆరోగ్యం బాగాలేదని మూకుమ్మడి సెలవు పెట్టడం న్యాయపరంగా తప్పుకాకపోయినప్పటికీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉందని తెలియజేశారు. అవే మీకు వర్తిస్తాయని మె
యిల్స్‌లో వెల్లడించారు.
బుధవారం ఎవరు షెడ్యూల్ ఏంటన్నది మంగళవారమే క్రూసిబ్బందికి తెలిపింది. అయితే" మీరు మాత్రం అఖరి నిమిషంలో ఆరోగ్యం బాగాలేదని షెడ్యూలింగ్ టీమ్‌కు చెప్పారు."
ఏదో ఒకరిద్దరు ఇలా చేయలేదు. మొత్తం క్రూ సిబ్బంది అనారోగ్యం పేరుతో విధులను ఎగ్గొట్టారు. ముందస్తుగా అనుకున్నట్టుగానే ఉంది. ఇలా చెప్పాపెట్టకుండా విధులకు దూరంగా ఉండటం సరైన నిర్ణయం కాదు.
"మీరు చేసిన ఈ పని వల్ల చాలా ఫ్లైట్స్ రద్దు అయ్యాయి. షెడ్యూల్ మొత్తం తారుమారైంది. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు." ఇది మీరు మూకుమ్మడిగా అనుకున్న చర్యగా భావిస్తున్నాం. విమానాల సర్వీస్‌లు ఆపాలనే కాదు మొత్తం సంస్థ అందిస్తున్న సేవలకే అంతరాయం కలిగించాలని మీ ఆలోచన.
ఈ కారణాలు వివరిస్తూ వచ్చిన ఎయిర్ ఇండియా... " మిమ్మల్ని ఇకపై ఎక్కువ కాలం సంస్థ సిబ్బందిగా కొనసాగించలేం. అధికారి మెయిల్స్, ఇతర సేవలను పొందలేరు. మీకు సంబంధించిన వాళ్లు కూడా ఉద్యోగికి సంస్థ ఇచ్చే సేవలు పొందలేరు."
ఒకేసారి క్రూ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో ఎయిర్ ఇండియాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో మే 13 వరకు సర్వీస్‌లు నిలిపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ ఓ ప్రకటన చేశారు. దీంతో తర్వాతే సెలవు పెట్టిన ఉద్యోగులందరికీ మెయిల్స్ వెళ్లాయి.
ఇలా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం భారీ సంఖ్యలో విమానాలు ఆగిపోవడం వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బంది పడటంపై కేంద్రం ఫోకస్ చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రమ పౌర విమానయాన శాఖ నివేదిక కోరింది. సమస్యను వెంటనే పరిష్కరించి విమాన సర్వీస్‌లను పునరుద్దరించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.
మంగళవారం రాత్రి నుంచి సిబ్బంది విధులకు హాజరుకాలేదు. ఆరోగ్యం బాగాలేదని చెబుతూ మూకుమ్మడిగా సెలవు పెట్టారు. దీంతో ఎక్కడికక్కడ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియ వేల మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం ఇవ్వలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా విమానాశ్రయాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.