AIDMK with Vijay: విజయ్‌తో పొత్తుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు- వచ్చే వారం కీలక సమావేశం
Vijaya TVK: విజయ్‌తో కలిసి వెళ్లేందుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నెల ఆరున కీలక సమావేశం నిర్వహించి పార్టీ నేతలతో చర్చించనుంది.
Tamil Nadu News: ఒక్క బహిరంగ సభతో తమిళనాట సంచలనంగా మారిన విజయ్... పొత్తులకు డోర్లు తెరిచే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయనతో జత కడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో అన్నా డీఎంకే ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఈ నెల ఆరున కీలక సమావేశం నిర్వహించనుంది. దీని కోసం పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతలతో చర్చించనుంది.
అన్నాడీఎఁకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో ఏముంది అంటే..."రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు, జిల్లా కార్యదర్శులు ఈ నెల ఆరున జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాలి" అని ఓ సర్క్యులర్‌ను విడుదల చేశారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి సమావే ప్రారంభకానుంది.
గత వారంలో మొదటి రాజకీయ బహిరంగ సభ పెట్టిన తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ సంచలనంగా మారారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్... గత కొంత కాలంగా పాలించిన అన్నాడీఎంకేను పల్లెత్తిమాట కూడా అనలేదు. అంతే కాకుండా మైండ్ సెట్ కలిసి ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని కూడా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అన్నాడీఎంకేపై విజయ్‌కు సాఫ్ట్ కార్నర్ ఉందన్న ఆలోచన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీని నడిపిచే దిక్కులేకుండా పోయారు. పార్టీని హస్తగతం చేసుకునేందుకు శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇలా ముగ్గురూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన అన్నాడీఎంకేకు ఘోర పరాభవం తప్పదలేదు. బీజేపీకి కూడా అనుకున్న సీట్లు రాలేదు. దీంతో ఈ రెండు పార్టీలు ప్రస్తుతానికి ఎవరికి వారుగానే ఉన్నాయి. అందుకే విజయ్ క్రేజ్‌ను వాడుకొని పార్టీ ఉనికి కాపాడుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. విజయ్‌తో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఉందా పార్టీ.
6న పార్టీ నేతలతో జరిగే సమావేశంలో విజయ్‌తో పొత్తు అంశమే ప్రధాన అజెండాగా ఉండబోతోందని అన్నాడీఎంకే వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే అవసరం లేకున్నా భేటీ అవ్వడంపై ఆసక్తి నెలకొంది. విజయ్‌తో పొత్తు అంశంపై చర్చించేందుకే ఈ భేటీ జరుగుతుందని అంటున్నారు.
పార్టీ స్థాపించిన తర్వాత అక్టోబర్ 27న తొలి బహిరంగ సభను విజయ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తమిళ, ద్రవిడ జాతీయవాద సిద్ధాంతాలను అనురిస్తామన్నారు. లౌకి, సామ్యవాద సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తామని.. పెరియరా రామస్వామి, కె. కామరాజ్, అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ చూపిన దారిలో వెళ్తామన్నారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా తనను అవమానించారని ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కూడా అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. అన్నింటినీ తట్టుకొని ప్రజలకు సేవచేయాలనే వచ్చానని అన్నారు. 2026 ఎన్నికల్లో ప్రజలను గెలిపించడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రయాణంలో ఎవరైనా కలిసి వస్తామంటే పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమన్నారు.
Also Read: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్