అన్వేషించండి

Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌

Nara Lokesh: గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్లను లోపల వేయాలంటే చంద్రబాబుకు రెండు నిమిషాల పని అన్నారు లోకేష్. కానీ తమకు రాష్ట్రం ముఖ్యమన్నారు.

Nara Lokesh Comments In Atlanta: విదేశాల్లో ఉండే భారతీయులను అంతా ఎన్‌ఆర్‌ఐలు అంటారని... ఇకపై వారిని ఎంఆర్‌ఐలుగా పిలుస్తానన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన టీడీపీ కార్యకర్తలు, నేతలు, తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

ఎన్‌ఆర్‌ఐలను ఇకపై మోస్ట్ రిలయబుల్‌ ఇండియన్స్‌గా అంటే ఎంఆర్‌ఐలుగా అభివర్ణించారు లోకేష్‌. ఉన్నత చదువులు చదివి రెండు సూట్‌ కేసులు పట్టుకొని చాలా మంది అమెరికా వచ్చారని... కానీ వారి మనసు ఎప్పడూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుదని అభిప్రాయపడ్డారు. ఆలోచన ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ గురించే ఉంటుందన్నారు. చిటిక వేస్తే వచ్చి సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. 

2024 ఎన్నికల్లో భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటర్లు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఏపీలో ఓట్లు వేశారని తెలిపారు. 175కి 175 అంటూ కాలర్ ఎగరేసిన వాళ్ల మొహాలు మాడిపోయేలా చేశారన్నారు. ఏపీని కాపాడుకోవాలని టీడీపీకి మద్దతుగా నిలబడాలని సొంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి మరీ ఓట్లు వేశారని వివరించారు. అంతక ముందు నుంచే చాలా కాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీల విజయం కోసం చాలా మంది శ్రమించారన్నారు. అందుకే ఈ విజయం కేవలం టీడీపీ, జనసేన, బీజేపీదే కాదు ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వాళ్లది. 

గతంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితేనో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే  కేసులు పెట్టే వారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేవాళ్లని తెలిపారు. వాటికి భయపడకుండా పార్టీ కోసం నిలబడిన వారందరికీ పాదాభివందనం చేశారు లోకేష్. 

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్‌ పథకాలను పద్దతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు లోకేష్. గతంలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తుందన్నారు.  మెగా డీఎస్సీ నోటీఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు చక్రాలుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 

ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు నారా లోకేష్. అందుకు చంద్రబాబే కారణం అన్నారు. ఆయన పేరు చెబితే ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారని గుర్తు చేశారు. సత్య నాదెళ్లకు ఒక్క మెయిల్ చేస్తే వచ్చి కలవాలని రిప్లై ఇచ్చారన్నారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో చెప్పాలన్నారని తెలిపారు. అందుకే ఇప్పుడు సీబీఎన్‌ మాత్రమే ఏపీ బ్రాండ్‌గా అభివర్ణించారు. 

టీడీపీకి బలం బలగం కార్యకర్తలేనన్నారు. భారత దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీ సొంతమని పేర్కొన్నారు. చేయని తప్పునకు చంద్రబాబును ఎలా బంధించారో చూశామని... ఇప్పుడు తలుచుకున్నా బాధగా ఉంటుందన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అదే కొండంత బలం ఇచ్చిందని జగన్‌పై పోరాడే శక్తి వచ్చిందన్నారు. 

రెడ్‌బుక్‌లో ఇప్పటికే రెండు చాప్టర్ ఓపెన్ అయ్యాయని అన్నారు లోకేష్‌. ఇప్పుడు మూడో చాప్టర్‌ ఓపెన్ చేస్తున్నామన్నారు. తగ్గేదే లేదన్నారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఆనాడు రెడ్ బుక్ గురించి చెబితే ఎక్కించుకోని వైసీపీ ఇప్పుడు భయపడుతోందన్నారు. ఇప్పుడు గుడ్ బుక్ అంటూ ఏదో రాస్తున్నారని ఎద్దేవా చేశారు. 
గత ఐదేళ్లు పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయంటే మన రాష్ట్రానికి ఏం రావడం లేదేంటీ అని బాధపడ్డానన్నారు లోకేష్. అదే విషయం ప్రజలు గుర్తించారని పెద్ద తీర్పు ఇచ్చారన్నారు. ఈ తీర్పు చూసిన తర్వాత కాస్త భయపడ్డాన్నారు. ప్రజల తీర్పును గౌరవించి హుందాగా ఉండాలని ఎమ్మెల్యేలతో మాట్లాడానని అన్నారు.

చంద్రబాబు తలచుకుంటే రెండు నిమిషాల్లో ఎవరినైనా లోపల వేయొచ్చని అన్నారు. ఏ తప్పు చేయని వ్యక్తిని 52 రోజులు జైల్లో వేసే బాధ ఉన్నా... ఆయన ఆ పని చేయలేదన్నారు. అది కరెక్ట్ కాదని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలన్నదే ఆలోచనగా ఉందన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాలని పెట్టుబడులు తీసుకురావాలని ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని అధికారం ఇచ్చారని ఉద్దేశంతోనే పాలన చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget